- Telugu News Photo Gallery Cricket photos MI vs DC, IPL 2024: Mumbai Indians To Invite 20K Kids From NGOs To Celebrate ESA Day At Wankhede Stadium
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు సెల్యూట్ చేయాల్సిందే.. 20 వేల మంది పిల్లలకు ఫ్రీ గా..
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 7) మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ప్రత్యేకత ఉంది.
Updated on: Apr 07, 2024 | 8:09 AM

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 7) మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ప్రత్యేకత ఉంది.

ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ మ్యాచ్ ను పిల్లలకు అంకితం చేయాలని నిర్ణయించింది. ఈ ఆదివారాన్ని ESA (అందరికీ విద్య, క్రీడలు) దినోత్సవంగా జరుపుకొంటామని ముంబై ఇండియన్స్ శుక్రవారం (ఏప్రిల్ 5) అధికారికంగా ప్రకటించింది.

ఇందులో భాగంగా ముంబై మహా నగరంలోని వివిధ NGOల నుంచి సుమారు 20,000 మంది పిల్లలను స్టేడియంలో ఉచితంగా మ్యాచ్ ను చూసేందుకు అనుమతించనున్నారు.

ముంబై ఇండియన్స్ 2010 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (ESA) వెనుకబడిన పిల్లలకు క్రీడలు, విద్యకు మద్దతునిస్తూ వారికి అండగా నిలుస్తోంది.

ఇందులో భాగంగా 2010 నుంచి ప్రతి సీజన్ లో వారి సొంత మైదానంలో అంటే వాంఖడేలో ఒక మ్యాచ్ కు ESA డేను సెలబ్రేట్ చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.





























