RR vs RCB, IPL 2024: కింగ్ కోహ్లీ సెంచరీ వృథా.. బెంగళూరు ఖాతాలో మరో ఓటమి

ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం (ఏప్రిల్ 06) రాత్రి జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది

RR vs RCB, IPL 2024: కింగ్ కోహ్లీ సెంచరీ వృథా.. బెంగళూరు ఖాతాలో మరో ఓటమి
Rajasthan Royals Vs Royal Challengers Bengaluru
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2024 | 12:03 AM

ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం (ఏప్రిల్ 06) రాత్రి జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగాడు. 184 పరుగుల విజయ లక్ష్యాన్ని బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. జోస్ బట్లర్ 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు సాధించి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 69 పరుగులతో రాణించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ రెండు పాయింట్లు సాధించింది. 8 పాయింట్లతో నేరుగా అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ దిశగా అడుగువేసింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. కాబట్టి రాబోయే మ్యాచుల్లో గెలవకపోతే ఆర్సీబీకి అంతే సంగతులు.

184 పరుగుల ఛేదనలో రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు. యశస్వి జైస్వాల్ ఖాతాను కూడా తెరవలేకపోయాడు. రీస్ టోప్లీ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో జోస్ బట్లర్, సంజూ శాంసన్ జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సంజూ శాంసన్ 42 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఇన్ ఫామ్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో త్వరగానే ఓటయ్యాడు. ధృవ్ జురెల్ కూడా కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే బట్లర్ అజేయ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఇవి కూడా చదవండి

దంచి కొట్టిన బట్లర్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోపుల్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నంద్రా బర్గర్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.