Virat Kohli: కింగ్ కోహ్లీపై ట్రోలింగ్.. సెంచరీ కొట్టినా విమర్శలే, ఎందుకంటే
ఎనిమిదో ఐపీఎల్ సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కోహ్లీ బ్యాటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కాపాడలేకపోయింది. కోహ్లీ ఇటీవలి ఫామ్ విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీ తిరిగి ఫామ్ లోకి రావడానికి నిదర్శనం.
ఎనిమిదో ఐపీఎల్ సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కోహ్లీ బ్యాటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కాపాడలేకపోయింది. కోహ్లీ ఇటీవలి ఫామ్ విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీ తిరిగి ఫామ్ లోకి రావడానికి నిదర్శనం. ఈ సీజన్లో ఇతర బ్యాటర్ల కంటే మెరుగైన ప్రతిభ కనబర్చాడు. అయితే, ముఖ్యంగా ఆటలో కీలక సమయాల్లో అతని స్లో పేస్ జట్టు విజయావకాశాలకు ఆటంకం కలిగించిందని విమర్శకులు వాదిస్తున్నారు.
ముఖ్యంగా 18, 19వ ఓవర్లలో అటాకింగ్ షాట్లకు బదులు సింగిల్ తీయడం అభిమానులతో పాటు క్రికెట్ క్రిటిక్స్ కు ఏమాత్రం మింగుడు పడలేదు. డుప్లెసిస్ తో మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ చివరి ఓవర్లలో కోహ్లీ వేగం పెంచలేకపోయాడు. సెంచరీ పూర్తి చేయడం వంటి వ్యక్తిగత మైలురాళ్లపై కోహ్లీ దృష్టి పెట్టడం జట్టు మొత్తం లక్ష్యాన్ని దెబ్బ తీసిందని అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ ఎక్కువగా పరుగులు తీస్తున్నంతా కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీ20 క్రికెట్లో ఓటమి పాలవుతుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
దీనికి కారణం కోహ్లీ. అతను గొప్ప ఆటగాడే అయినా వేగవంతమైన టీ20 మ్యాచుల్లో అతని శైలి సరిగ్గా సరిపోదని కామెంట్ చేస్తున్నారు. కెరీర్ చివర్లో ఎంఎస్ ధోనీ ఏం చేస్తున్నాడో అదే కోహ్లీ చేయాలని కొందరు సూచిస్తున్నారు. ధోనీ 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ బంతులు ఎదుర్కోకుండా, 2 ఓవర్లకు మించకుండా హిట్టింగ్ చేస్తున్నాడని… విరాట్ కూడా అలాగే చేయాలని కొందరు వాదిస్తున్నారు. అయితే నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ తప్ప ఏ ఒక్క ఆటగాడు రాణించలేకపోయారు. బ్యాటింగ్ లోనే కాదు.. బౌలింగ్ లో ఆర్సీ బీ ఫెయిల్ అయ్యింది. కోహ్లీ రాకింగ్ బ్యాటింగ్ చేయకుంటే 180 స్కోరు కూడా దాటేది కాదంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్.