LSG vs GT, IPL 2024: అర్ధసెంచరీతో రాణించిన మార్కస్ స్టొయినిస్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ టోర్నీలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య 21వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మార్కస్ స్టొయినిస్ (43 బంతుల్లో 58) మినహా మరెవరూ పెద్దగా రాణించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో

Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ టోర్నీలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య 21వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మార్కస్ స్టొయినిస్ (43 బంతుల్లో 58) మినహా మరెవరూ పెద్దగా రాణించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (33), పూరన్ (32), ఆయుష్ బదోని (20) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, డికాక్ (6), పడిక్కల్ (7) నిరాశ పర్చారు. గుజరాత్ బౌలర్లలో దర్శన్, ఉమేశ్ చెరో 2 వికెట్లు తీయగా.. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.లక్నో సూపర్ జెయింట్స్ కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే క్వింటన్ డి కాక్ సిక్సర్ బాది ఔటయ్యాడు. అతని తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ స్థితిలో కెప్టెన్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నిలకడగానే ఆడినా వేగంగా ఆడలేకపోయారు. ఫలితంగా స్కోరు వేగం మందగించింది.
కే ఎల్ రాహుల్ 31 బంతుల్లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. మార్కస్ స్టోయినిస్ 43 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆయుష్ బదానీ 11 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. చివరగా, నికోలస్ పూరన్ దూకుడుగా ఆడాడు. మూడు సిక్సర్లు బాదడంతో లక్నోకు గౌరవప్రదమైన స్కోరు వచ్చింది.
Nicholas Pooran so far this season:
64(41) vs RR 42(21) vs PBKS 40*(21) vs RCB 32*(22) vs GT 👏🔥 pic.twitter.com/6JGS8XVOHi
— Lucknow Super Giants (@LucknowIPL) April 7, 2024
We’ve loved you for a 1000 runs, we’ll love you for 10,000 more 🫠💙
LSG milestone for Kaptaan 🙌 pic.twitter.com/7U7BAuPPm2
— Lucknow Super Giants (@LucknowIPL) April 7, 2024
రెండు జట్ల XI ప్లేయింగ్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్ (కెప్టెన్), శరత్ బిఆర్ (వికెట్ కీపర్), సాయి సందర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








