Ramayana Movie: రాముడి పాత్రలో రణ్‌బీర్ లుక్ ఇదేనా? నెట్టింట వైరలవుతోన్న ఫొటోస్

. రామాయణం కథ ఆధారంగా నితీష్ తివారీ తెరకెక్కించనున్న సినిమాలో రణబీర్ కపూర్‌కు రాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ క్రేజీ మూవీ సినిమా షూటింగ్ పట్టాలెక్కింది. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల లుక్స్ కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. అయితే

Ramayana Movie: రాముడి పాత్రలో రణ్‌బీర్ లుక్ ఇదేనా? నెట్టింట వైరలవుతోన్న ఫొటోస్
Ranbir Kapoor, Sai Pallavi
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2024 | 10:10 PM

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ఇప్పటికే నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ఇండస్ట్రీ హిట్లుకొట్టాడు. ఇక గతేడాది విడుదలైన ‘యానిమల్‌’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడీ హ్యాండ్సమ్ హీరో. ఇప్పుడు రణ్ బీర్ కు మరో పెద్ద అవకాశం వచ్చిందని తెలిసింది. రామాయణం కథ ఆధారంగా నితీష్ తివారీ తెరకెక్కించనున్న సినిమాలో రణబీర్ కపూర్‌కు రాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ క్రేజీ మూవీ సినిమా షూటింగ్ పట్టాలెక్కింది. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల లుక్స్ కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. అయితే సోషల్ మీడియాలో రామాయణం సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎలా ఉంటున్నాడో చెబుతూ కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోలు సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో రణ్ బీర్ కపూర్ రాముడి పాత్రలో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఇది అధికారిక పోస్టర్ కాదు. అయితే, అభిమానులకు మాత్రం ఈ పోస్టర్ తెగ నచ్చేసింది.

రామాయణం సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. ‘రామాయణం’ సినిమా షూటింగ్ సెట్స్ నుండి కైకేయిగా లారా దత్తా, దశరథుడి పాత్రలో అరుణ్ గోవిల్ ఫోటోలు లీక్ అయ్యాయి. దీని తర్వాత చిత్రబృందం మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో చాలా మంది వెటరన్ ఆర్టిస్టులు నటించనున్నారు. ‘రామాయణం’ నటీనటులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. యష్ రావణుడి పాత్రలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. ఆంజనేయుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చిత్రబృందం నుండి నటీనటుల గురించి అధికారిక సమాచారం వెలువడనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Filmy Entity (@filmyentity)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!