- Telugu News Photo Gallery Cinema photos Anchor Anasuya Bharadwaj on Bonding with Roja and Nagababu who are in different political parties Telugu Actress Photos
Anasuya Bharadwaj: నాగబాబు-రోజా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.? అనసూయ అదిరిపోయే రిప్లై.!
స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. యాంకర్ గా పలు షోలను నడిపించిన అనసూయ మెల్లిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అనసూయ.. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Anil kumar poka | Edited By: TV9 Telugu
Updated on: Apr 08, 2024 | 7:18 PM

స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. యాంకర్ గా పలు షోలను నడిపించిన అనసూయ మెల్లిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అనసూయ.. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ కేక్‌లా కనిపిస్తూ న్యూ ఫోటోషూట్స్ తో ట్రేండింగ్ లో ఉండే అనసూయ.. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ గురించి మాట్లాడారు.

జనసేనాని పవన్ పిలిస్తే.. జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా అని ఓ హోస్ట్ అడగగా.. " నాకు పార్టీతో సంబంధం లేదు. వ్యక్తి గుణం మాత్రమే ముఖ్యం"

":ఫస్ట్ పోటీ చేసే పర్సన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాను. తర్వాత నాకు ఓకే అనిపిస్తే తప్పకుండా ప్రచారం చేస్తాననని అన్నారు.

తర్వాత నాగబాబు-రోజా చెరొక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా? మీరు ఎవరికి సపోర్ట్ అని అడిగితే..

నేను నాగబాబు అండ్ రోజా ఇద్దరితో క్లోజ్ గా నే ఉంటాను. కాకపోతే నాగబాబు తోనే కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుంది.. అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చారు.

ఆంధ్రాలో ఎన్నికల జోరుగా జరుగుతుండడంతో అమ్మడు అనసూయ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది.





























