Katha Venuka Katha OTT: IMDB 7.3 రేటింగ్‌.. ఓటీటీలో దూసుకెళుతోన్న ఇంటెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లలో హిట్ కానీ సినిమాలు కూడా ఒక్కోసారి ఓటీటీల్లో అదరగొడుతుంటాయి. ప్రమోషన్లు లేకనో, థియేటర్లు లేకనో పెద్దగా ఆదరణకు నోచుకోని మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుంటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ సినిమాలకు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇదే కోవకు చెందుతుంది సునీల్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘కథ వెనుక కథ

Katha Venuka Katha OTT: IMDB 7.3 రేటింగ్‌.. ఓటీటీలో దూసుకెళుతోన్న ఇంటెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Katha Venuka Katha Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2024 | 9:26 PM

థియేటర్లలో హిట్ కానీ సినిమాలు కూడా ఒక్కోసారి ఓటీటీల్లో అదరగొడుతుంటాయి. ప్రమోషన్లు లేకనో, థియేటర్లు లేకనో పెద్దగా ఆదరణకు నోచుకోని మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుంటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ సినిమాలకు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇదే కోవకు చెందుతుంది సునీల్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది మే 12న థియేటర్లలో విడుదలైన కథ వెనుక కథ సినిమా యావరేజ్ గా నిలిచింది. సరైన ప్రమోషన్లు లేకపోవడంతో పెద్దగా వసూళ్లు రాలేదు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందంటూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు బాగున్నాయంటున్నారు.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న కథ వెనక కథ సినిమాకు ఐఎమ్‌డీబీ సంస్థ 10కి 7.3 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సినిమా డైరెక్టర్ కావాలని హీరో విశ్వంత్ కల. హీరో తన మరదలిని పెళ్ళి చేసుకోవాలంటే కచ్చితంగా హిట్ కొట్టాలి అని షరతు పెడతాడు మేనమామ. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఒక సినిమా అవకాశం తెచ్చుకుంటాడు. తర్వాత సిటీలో ఒక గ్యాంగ్ కొంతమంది అమ్మాయిలను హత్య చేస్తుంటారు. ఆ గ్యాంగ్‌ని పట్టుకోవడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తారు అధికారులు. అదే సమయంలో హీరో సినిమాకి ఒక సమస్య వస్తుంది. మరి వీటన్నిటినీ హీరో ఎలా అధిగమించాడన్నదే కథ వెనక కథ సినిమా.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సునీల్ కథ వెనుక కథ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!