AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premalu OTT: ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆహాలో ఎప్పుడు చూడొచ్చంటే..

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ మమితా బైజుకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఏర్ప్డింది. ఇక థియేటర్లలో అలరించిన ఈసినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

Premalu OTT: ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆహాలో ఎప్పుడు చూడొచ్చంటే..
Premalu Movie
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2024 | 10:36 AM

Share

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘ప్రేమలు’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 8న తెలుగులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మలయాళీ నటీనటులు నస్లెన్ కె గపూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ మమితా బైజుకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఏర్ప్డింది. ఇక థియేటర్లలో అలరించిన ఈసినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా వెల్లడిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రేమ మరింత వైరల్ అవుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈసినిమా మరో ఓటీటీలోకి వచ్చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తోపాటు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే మలయాళీ వెర్షన్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉండనుంది.

ఈ చిత్రాన్ని భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు. ఇన్నాళ్లు థియేటర్లలో ఈలవ్ స్టోరీని మిస్ అయిన వారు ఇప్పుడు ఆహాలో ఈ మూవీని చేసేయ్యోచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!