Evil Monster: భర్త రూపంలో నరరూప రాక్షసుడు.. భార్యను చంపి మృతదేహాన్ని 224 ముక్కలుగా నరికి..
నూరేళ్లు తోడుండవల్సిన ఓ భర్తే తన భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని 224 ముక్కలుగా నరికి, పాస్టిక్ కవర్లలో నింపి నదిలో పారేసి చేతులు దులుపుకున్నాడు. ఎవరికీ తెలియదులే అని అనుకున్నాడు. కానీ సరిగ్గా ఏడాది తర్వాత అతను చేసిన పాపం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. కట్‌చేస్తే జైళ్లో చిప్పకూడు తింటూ శిక్ష అనుభవిస్తు్నాడు. ఈ దారుణ ఘటన యూకేలో వెలుగు చూసింది..
లండన్, ఏప్రిల్ 7: నూరేళ్లు తోడుండవల్సిన ఓ భర్తే తన భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని 224 ముక్కలుగా నరికి, పాస్టిక్ కవర్లలో నింపి నదిలో పారేసి చేతులు దులుపుకున్నాడు. ఎవరికీ తెలియదులే అని అనుకున్నాడు. కానీ సరిగ్గా ఏడాది తర్వాత అతను చేసిన పాపం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. కట్‌చేస్తే జైళ్లో చిప్పకూడు తింటూ శిక్ష అనుభవిస్తు్నాడు. ఈ దారుణ ఘటన యూకేలో వెలుగు చూసింది. లింకన్‌షైర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యూకేలోని లింకన్ నగరానికి చెందిన హోలీ బ్రామ్లీ (26), నికోలస్ మెట్‌సన్ (28) దంపతులు. గత ఏడాది మార్చి 17 నుంచి హోలీ బ్రామ్లీ కనబడటం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లి, సోదరి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత అంటే మార్చి 25, 2023న మహిళ శరీర భాగాలు లింకన్‌షైర్‌లోని బాసింగ్‌హామ్ వద్ద నదిలో కొట్టుకువచ్చాయి. 224 ముక్కలుగా నరికిన మానవ శరీర భాగాలు అవి. పోలీసులు ఆ శరీర భాగాలు హోలీ బ్రామ్లీకి చెందినవిగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో తొలుత పోలీసులు మృతురాలి భర్త నికోలస్ మెట్‌సన్‌ను అనుమానించారు. దీంతో మార్చి 24న మెట్‌సన్ అపార్ట్‌మెంట్‌కు పోలీసులు చేరుకుని అతడ్ని భార్య గురించి అడిగారు. అయితే ఆమె తనపై గృహ హింసకు పాల్పడిందని ఆరోపించాడు. మార్చి 19న స్థానిక మానసిక ఆరోగ్య బృందంతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. అయితే పోలీసులు అతడి ఇంటిలోపలికి ప్రవేశించి లోపలంతా పరిశీలించారు. బాత్ రూమ్‌లోని టబ్‌లో రక్తం మరకలున్న బెట్ షీట్లు, బెడ్ రూమ్ నేలపై రక్తం మరకలు, కిచెన్‌లో రంపం, రసాయనాల వాసనలు గమనించిన పోలీసులు భార్యను మెట్‌సన్ హత్య చేసి ఉంటాడని అనుమానించి అరెస్ట్ చేశారు.
అయితే హత్య కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి జాషువా హాన్‌కాక్ (28) నేరాన్ని అంగీకరించడంతో అసలు విషయం బయటపడింది. హాన్‌కాక్.. మెట్‌సన్ స్నేహితుడని, హత్య జరిగిన తర్వాత వారం రోజులపాటు మృతదేహాన్ని దాచిపెట్టారని, అవశేషాలను పారవేయడంలో మెట్సన్ అతనికి డబ్బు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిపింది. నికోలస్ ఆ ప్లాస్టిక్ బ్యాగులను లిఫ్ట్ ద్వారా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కాగా మెట్సన్ గతంలో పెళ్లి చేసుకున్న తన భార్యలను కూడా ఇదే విధంగా హత మర్చినట్ల పోలీసులు గుర్తించారు. 2013, 2016, 2017లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. 2021లో హోలీ బ్రామ్లీని వివాహం హట్సన్ చేసుకున్నాడు. అయితే వీరి వివాహం జరిగి 16 నెలలు గడవక ముందే ఈ జంట విడిపోయేందుకు సిద్ధపడింది. ఈ దశలో బ్రామ్లీని హత్య చేశాడు. తన అపార్ట్‌మెంట్‌లోబ్రామ్లీని కత్తితో పొడిచి చంపినట్లు కోర్టుకు తెలిపాడు. అయితే అతను భార్యలను ఎందుకు చంపుతున్నాడు అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. నికోలస్, అతడికి సహకరించిన స్నేహితుడిని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి శిక్షలు ఖరారు చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.