AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Longest Moustache: బుర్ర మీసాలు కాదు.. చాంతాడు మీసాల తాత! ఏకంగా 24 అడుగుల పొడవు పెంచేశాడు

మగరాయుళ్లకు మీసం కట్టు ఓ అందం. మీసం పెద్దరికాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే భారతీయ పురుషులు మీసాలను గౌరవ ప్రధంగా భావిస్తారు. మన దేశంలో యుక్తవయసు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ మీసం మెయింటెన్‌ చేస్తుంటారు. అయితే సాధారణంగా వారి వారి అభిరుచిని బట్టి వివిధ రూపాలలో మీసాలను పెంచుతూ ఉంటారు. కానీ ఓ పెద్దాయన మాత్రం మీసం పెంచడమే పనిగా పెట్టుకున్నట్టు..

Longest Moustache: బుర్ర మీసాలు కాదు.. చాంతాడు మీసాల తాత! ఏకంగా 24 అడుగుల పొడవు పెంచేశాడు
Hamirpur's Balkishan Longest Moustache
Srilakshmi C
|

Updated on: Apr 05, 2024 | 4:50 PM

Share

హమీర్‌పూర్, ఏప్రిల్ 5: మగరాయుళ్లకు మీసం కట్టు ఓ అందం. మీసం పెద్దరికాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే భారతీయ పురుషులు మీసాలను గౌరవ ప్రధంగా భావిస్తారు. మన దేశంలో యుక్తవయసు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ మీసం మెయింటెన్‌ చేస్తుంటారు. అయితే సాధారణంగా వారి వారి అభిరుచిని బట్టి వివిధ రూపాలలో మీసాలను పెంచుతూ ఉంటారు. కానీ ఓ పెద్దాయన మాత్రం మీసం పెంచడమే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఏకంగా 24 అడుగుల పొడవున మీసాలు పెంచేశాడు. పైగా మీసాలు ఏపుగా పెరిగేందుకు కొన్ని ప్రత్యేక పద్ధతులను కూడా పాటిస్తున్నాడు. ఆయనెవరో.. ఆయనగారి మీసం కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం..

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన బాల్కిషన్ లోధీ (64) అనే వృద్ధుడు గురించే మనం చర్చిస్తోంది. ఆయన గత 34 ఏళ్లుగా అసలు మీసాలను కత్తిరించలేదట. రకరకాల నూనెలు వాడి 24 అడుగుల మేర మీసాలు పెంచేశాడు. అబ్బే.. కాస్త పొడవుపెరిగితేనే చిరాకు పడిపోయి కట్ చేసుకుంటూ ఉంటారు. మూడు దశాబ్ధాలు మీసాలను ఎలా మెయింటెన్ చేశాడనే కదా అనుకుంటున్నారు? బాల్కిషన్ తాతకు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైందట. అందుకే రెండు వైపులా మీసాలను మడతపెట్టి దారంతో కట్టి.. ఆ దారాన్ని చెవులకు తగిలించుకుంటాడు. స్నానం చేసేటప్పుడు మాత్రం తన మీసాలను ఫీగా వదిలేస్తాడు.. మిగతా అన్ని సమయంలో మడతపెట్టి కట్టి ఉంచుతాడు. మీసాలను పెంచేందుకు మంచి పోషకాహారం తినడంతోపాటు ఆవాల నూనె రాసి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా పెంచుకున్న మీసాల ద్వారా తనకెంతో గుర్తింపు వచ్చిందని అంటున్నాడు బాల్కిషన్ తాత. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నానని చెబుతున్నాడు. అసలు ఇంత పొడవున ఎందుకు మీసాలు పెంచావని అడిగితే ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. అదేంటంటే..

1991లోఓ కేసు విషయమై తాను జైలులో ఉన్నానని, ఆ సమయంలో తన మీసాలు 8 అంగుళాల పొడవు పెరిగాయని తెలిపాడు. అదే సమయంలో ఫూలన్ దేవి గ్యాంగ్‌కు చెందిన ప్రముఖ డకాయిట్ లఖన్ సింగ్ కూడా జైలులోనే ఉన్నాడు. అతనికి దాదాపు 24 అంగుళాల మీసం ఉందట. జైలులోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట మీసాల ఖైదీలందరినీ తీసుకొచ్చి వరుసలో నిలబెట్టారు. ఖైదీల వరుసలో బాల్కిషన్ కూడా ఉన్నాడట. అయితే అతని ఎనిమిది అంగుళాల మీసాలు చూసి మున్సిఫ్ మెజిస్ట్రేట్ అతన్ని అవమానించి లైన్లో నుంచి తప్పించాడట. దీంతో తాను కూడా ఏనాటికైనా 24 అడుగుల మీసాలుపెంచుతానని ప్రమాణం చేశాడు. అప్పటి నుంచి తన మీసాలను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు. చివరికి తన తండ్రి చనిపోయినప్పుడు కూడా మీసాలను తొలగించలేదట. మీసాలు ఏపుగా పెరిగేందుకు పాల మీగడ, మజ్జిగ, చెద పురుగుల మట్టితో కడుగుతాడట. తర్వత ఆవాల నూనె, జామ నూనెను రాస్తానని చెప్పాడు. తన మీసాల కారణంగా ఎక్కడికి వెల్లినా ప్రజలు తనను ఆసక్తిగా చూస్తారని, తనతో ఫొటోలు దిగుతారని చెప్పుకొచ్చాడు. ఎక్కడికైనా పని మీద వెళ్తే తన మీసాలుచూపిస్తే చేసిపెడతారట. గ్వాలియర్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో తన మీసాలకు రూ. 5000 బహుమతి, వెండి జాపత్రి అందుకున్నట్లు ఆనందంతో చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.