High Court: హైకోర్టులో సీజే ఎదుట ఘోరం.. అందరూ చూస్తుండగా గొంతు కోసుకున్న వ్యక్తి..! కేసు నమోదు

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిలయ్‌ విపిన్‌చంద్ర అంజరా, న్యాయమూర్తి హెచ్‌బి ప్రభాకర శాస్త్రితో కూడిన ధర్మాసనం కోర్టు హాలులో బుధవారం కేసులను విచారిస్తున్నారు. ఆ సమయంలో మైసూరుకు చెందిన ఎస్‌ చిన్నం శ్రీనివాస్ దంపతులు హైకోర్టులోకి ప్రవేశించారు. అనంతరం కోర్టు హాల్ వన్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి ఫైల్‌ను అందజేశారు. వినతి పత్రం చదివిన వెంటనే శ్రీనివాస్‌ తన ప్యాంటు జేబులో నుంచి కత్తి తీసి..

High Court: హైకోర్టులో సీజే ఎదుట ఘోరం.. అందరూ చూస్తుండగా గొంతు కోసుకున్న వ్యక్తి..! కేసు నమోదు
Karnataka High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2024 | 5:35 PM

మైసూర్‌, ఏప్రిల్ 4: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ షాకింగ్‌ ఘటన బుధవారం (ఏప్రిల్ 3) చోటు చేసకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం..

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిలయ్‌ విపిన్‌చంద్ర అంజరా, న్యాయమూర్తి హెచ్‌బి ప్రభాకర శాస్త్రితో కూడిన ధర్మాసనం కోర్టు హాలులో బుధవారం కేసులను విచారిస్తున్నారు. ఆ సమయంలో మైసూరుకు చెందిన ఎస్‌ చిన్నం శ్రీనివాస్ దంపతులు హైకోర్టులోకి ప్రవేశించారు. అనంతరం కోర్టు హాల్ వన్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి ఫైల్‌ను అందజేశారు. వినతి పత్రం చదివిన వెంటనే శ్రీనివాస్‌ తన ప్యాంటు జేబులో నుంచి కత్తి తీసి ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే గొంతు కోసుకున్నాడు. చీఫ్ జస్టిస్ అంజరియా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించాలని కోరారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ శాస్త్రి, ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ తన వద్ద కత్తిని దాచుకుని సెక్యురిటీని ఎలా దాటగలిగాడని ప్రశ్నించారు.

కాగా బలంగా గొంతు కోసుకోవడం వల్ల శ్రీనివాస్‌ ఆహార నాళం దెబ్బతిందని, ప్రస్తుతం అతనికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అందిస్తున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి ముందు ఎందుకు ఇంత తీవ్రమైన చర్యకు పాల్పడ్డాతో తెలియడం లేదన్నారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. అతను శారీరకంగా ఫిట్‌గా ఉన్న తర్వాత మాత్రమే మేము అతని స్టేట్‌మెంట్ తీసుకోగం అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

హైకోర్టు ప్రాంగణంలోని భద్రతపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిలయ్ విపిన్ చంద్ర అంజారా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పదునైన వస్తువులను కోర్టులోకి అనుమతించడంపై ప్రశ్నించారు. ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించి రికార్డులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే, శ్రీనివాస్‌ తన గొంతు కోసుకునే ముందు సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చిన ఫైల్‌లో ఏముందనే విషయం తెలియరాలేదు. ఆ ఫైల్‌ న్యాయవాదికి సమర్పించనందున ఫైల్‌లోని అంశాలను కోర్టు తనిఖీ చేయలేదు. దీనిపై శ్రీనివాస్ భార్యను ప్రశ్నించగా.. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థపై 2021లో మైసూరులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కర్ణాటక హైకోర్టు గతంలో రద్దు చేసింది. 93 లక్షలను ఆ సంస్థ మోసం చేసిందని శ్రీనివాస్‌ ఆరోపించాడు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో కింది కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కలత చెందిన శ్రీనివాసం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే