Adoption: ‘ఉద్యోగం చేయలేకపోతున్నాం.. మా బిడ్డను దత్తత తీసుకోండి’ ఆన్‌లైన్‌లో ఓ జంట ప్రకటన
మాతృత్వం ఓ వరం.. బిడ్డను నవమాసాలు గర్భంలో మోసి.. ప్రసవం తర్వాత కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్దచేస్తుంది ప్రతీ తల్లి. ఈ మొత్తం ప్రక్రియను ఏ తల్లైనా ఆనందంగా ఆస్వాదిస్తుంటే తప్ప ఎప్పుడూ భారంగా భావించదు. అయితే నేటి కాలంలో యువత పోకడ కొంత విడ్డూరంగా ఉంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో పడి వివాహ జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని అడ్డంకిగా భావిస్తున్నారు. అలాంటి ఓ జంట సామాజిక మాధ్యమం..
మాతృత్వం ఓ వరం.. బిడ్డను నవమాసాలు గర్భంలో మోసి.. ప్రసవం తర్వాత కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్దచేస్తుంది ప్రతీ తల్లి. ఈ మొత్తం ప్రక్రియను ఏ తల్లైనా ఆనందంగా ఆస్వాదిస్తుంటే తప్ప ఎప్పుడూ భారంగా భావించదు. అయితే నేటి కాలంలో యువత పోకడ కొంత విడ్డూరంగా ఉంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో పడి వివాహ జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని అడ్డంకిగా భావిస్తున్నారు. అలాంటి ఓ జంట సామాజిక మాధ్యమం రెడిట్ వేదికగా విచిత్ర ప్రకటన వెలువరించారు. అదేంటంటే తమ 3 నెలల కుమార్తె ఎలిజబెత్‌ను ఎవరికైనా దత్తత ఇద్దామని అనుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అంత చిన్న బిడ్డను దత్తత ఇవ్వడానికి ఆ జంట చెప్పిన కారణం వింటే పరేషాన్ అవుతారు.
భార్యభర్తలిరువురూ తమ ఉద్యోగాల్లో బిజీగా ఉండడం వల్ల చిన్నారిని చూసుకోలేకపోతున్నామని, తమకు అసలు సమయం సరిపోవట్లేదని అందుకే బిడ్డను దత్తత ఇవ్వాలనుకుంటున్నట్లు బిడ్డ తండ్రి ఆన్‌లైన్ ప్రకటనలో పేర్కొన్నాడు. చిన్నారికి ఆహారం తినిపించడం నుంచి దుస్తులు మార్చడం, స్నానం చేయించడం వంటివి చేసేందుకు తన భార్యకు అస్సలు సమయం సరిపోవట్లేదని.. తమిద్దరూ ఆఫీసు పనుల్లో బిజీగా ఉండటం వల్ల కుమార్తె అవసరాలను తీర్చడానికి పనిని వదులుకోవాల్సి వస్తుందని, వర్క్ హాలిక్‌లైన మేము అలా చేయలేకపోతున్నామని రాసుకొచ్చాడు. తన భార్య గర్భం దాల్చిన తర్వాత, మెటర్నిటీ సెలవులను తన భార్య ఉపయోగించుకుంటుందని భావించాడట. కానీ ఆమె రెండు వారాల తర్వాత తిరిగి ఆఫీస్‌కు వెళ్లడం ప్రారంభించిందని, ఇప్పటివరకు తామెప్పుడూ ఎలిజబెత్‌తో సమయం గడపలేదని తెలిపాడు.
తన భార్య వర్క్‌లో బిజీగా ఉండటం వల్ల చిన్నారి ఎలిజబెత్‌కు తల్లి పాలు ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిన్నారిని ఆమె అమ్మమ్మ చూసుకుంటున్నారని తెలిపారు. కావాలంటే చిన్నారిని ఆమె అమ్మమ్మ కాని, కుటుంబంలోని ఇతరులు ఎవరైనా దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే వారు ముందుకురాకపోతే ఇతరులెవరికైనా దత్తత తీసుకోవాలని రెడ్డిట్ థ్రెడ్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటన వెలువరించాడు. వీరి ప్రకటన నెట్టింట వైరల్ కావడంతో ఈ జంట తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లల పెంపకంపై తల్లిదండ్రుల బాధ్యత గురించి నెట్టింట చర్చ ప్రారంభమైంది. ‘ఈ వ్యక్తికి ఎలాంటి భావోధ్వేగాలు లేనట్లు ఉంది’, ‘ఈ జంట రోబోల్లా, గ్రహాంతర వాసుల్లా మానవ జీవితాన్ని మార్చేస్తున్నారు’ అంటూ చురకలు అంటిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.