Viral Video: స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయిన యజమాని.. ప్రాణాలకు తెగించి కాపాడిన మూగజీవి! హార్ట్‌ టచింగ్‌ వీడియో..

విశ్వాసంలో శునకానికి మించిన ప్రాణి ఈ భూమిపై మరొకటి లేదు అనడం అతిశయోక్తి కాదేమో. పట్టెడు అన్నం పెట్టి ఆదరించిన యజమాని కోసం అవి ఎలాంటి రిస్క్‌ చేయడానికైనా వెనకాడవు. అందుకే కుక్కలు మనుషులకు మధ్య స్నేహ భావం ఇతర జంతువుల కంటే మరింత బలంగా ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు పలు సందర్భాల్లో ఈ విషయంలో తమ నిజాయితీని నిరూపించుకున్నాయి శునకాలు. తాజాగా అటువంటి సంఘటనే మరొకటి జరిగింది..

Viral Video: స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయిన యజమాని.. ప్రాణాలకు తెగించి కాపాడిన మూగజీవి! హార్ట్‌ టచింగ్‌ వీడియో..
Dog Saves Owner Life
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2024 | 5:34 PM

విశ్వాసంలో శునకానికి మించిన ప్రాణి ఈ భూమిపై మరొకటి లేదు అనడం అతిశయోక్తి కాదేమో. పట్టెడు అన్నం పెట్టి ఆదరించిన యజమాని కోసం అవి ఎలాంటి రిస్క్‌ చేయడానికైనా వెనకాడవు. అందుకే కుక్కలు మనుషులకు మధ్య స్నేహ భావం ఇతర జంతువుల కంటే మరింత బలంగా ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు పలు సందర్భాల్లో ఈ విషయంలో తమ నిజాయితీని నిరూపించుకున్నాయి శునకాలు. తాజాగా అటువంటి సంఘటనే మరొకటి జరిగింది. అపాయంలో ఉన్న తన యజమానిని ఓ కుక్క కాపాడిన విధానం చూసి ప్రతిఒక్కరూ ఔరా అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ చూసేయండి..

ఈ వీడియలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద స్విమ్మింగ్‌ పూల్‌ కనిపిస్తుంది. అయితే స్మిమ్మింగ్‌ పూల్‌ గట్టుపై ఇద్దరు వ్యక్తులు ఏదో గొడవ పడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అనంతరం ఒక వ్యక్తి మరో వ్యక్తిని నీళ్లలోకి తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నీళ్లలో పడ్డ వ్యక్తి కాళ్లు చేతులు ఆడిస్తూ మునిగిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తాడు. ఇదంతా నిర్మాణం జరుగుతోన్న బిల్డింగ్‌పై ఉన్న గమనించి వెంటనే పరుగుపరుగున స్విమ్మింగ్‌ పూల్‌ వద్దకు వస్తుంది. వెంటనే ఆ మూగ జీవికి ఏం చేయాలో, ఎటు నుంచి పైకి ఎక్కాలో పాలుపోక అరుస్తూ అటుఇటూ పరుగెత్తుతుంది. ఆ తర్వాత దారి కనుక్కోని ఒక్కసారిగా నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వ్యక్తి వద్దకు ఈదుకుంటూ వెళ్తుంది. అతన్ని పట్టుకుని స్విమ్మింగ్‌పూల్‌ గట్టుకు చేరుస్తుంది. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నిజానికి.. ఇదంతా కుక్కను పరీక్షించడానికి దాని యజమాని ఆడిన నాటకం అట. యజమాని తన కుక్క తనను కాపాడుతుందో లేదో చూడడానికి మునిగిపోతున్నట్లు నటించాడట. ఈ విషయం శునకానికి తెలియకపోయినా దాని సహజ స్వభావం రిత్యా యజమానిని కాపాడుకుని తన విశ్వాసాన్ని నిరూపించుకుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు దాదాపు 22.8 మిలియన్ల వ్యూస్‌, లక్షల్లో లైకులు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వైరల్ క్లిప్ యజమాని పట్ల కుక్క తన విధేయత, శ్రద్ధను మరోసారి రుజువు చేసిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విశ్వాసం, స్వామి భక్తిలో కుక్కను మించిన ప్రాణి ఈ భూమి మీద మరొకటి లేదు. ఇంతకీ మీరేం అంటారు.. నిజమే కదా!

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే