Viral News: ఆ అమ్మాయి ప్యాకేజీ 4 లక్షలు.. కాబోయే వరుడి కోసం పెట్టిన కండీషన్ తెలుసుకుంటే షాక్

ముంబైకి చెందిన 37 ఏళ్ల మహిళ కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మహిళ వరుడి కోసం వెతుకుతోంది. అయితే ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలు ఆమె అంచనాలను అందుకోవడం లేదట. వాస్తవానికి అబ్బాయిలే పెళ్లికి కండీషన్ పెడుతారు. కానీ ఓ మహిళ కాబోయే పెళ్లి కొడుకుకు కండీషన్ పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది.

Viral News: ఆ అమ్మాయి ప్యాకేజీ 4 లక్షలు.. కాబోయే వరుడి కోసం పెట్టిన కండీషన్ తెలుసుకుంటే షాక్
Mumbai Women
Follow us
Balu Jajala

|

Updated on: Apr 03, 2024 | 6:16 PM

ముంబైకి చెందిన 37 ఏళ్ల మహిళ కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మహిళ వరుడి కోసం వెతుకుతోంది. అయితే ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలు ఆమె అంచనాలను అందుకోవడం లేదట. వాస్తవానికి అబ్బాయిలే పెళ్లికి కండీషన్ పెడుతారు. కానీ ఓ మహిళ కాబోయే పెళ్లి కొడుకుకు కండీషన్ పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆమె కండీషన్ కు ఏ మగాడు సరిపోకవడంతో సోషల్ మీడియా వేదికగా తన డిమాండ్ ను బయటపెట్టింది. అయితే ఆమె డిమాండ్ తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

అంబర్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో 37 మహిళ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. ఆ మహిళ ముంబైలో పనిచేస్తుందని, ఏడాదికి రూ.4 లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది. ముంబైలో సొంత ఇల్లు ఉన్న ఆమె కాబోయే వరుడి కోసం వెతుకుతుంది. ఆ మహిళ తాను సర్జన్ లేదా సిఎకు ప్రాధాన్యత ఇస్తానని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏదైనా ఉద్యోగం చేసినా, బిజినెస్ చేస్తున్నా ఒకే అని అంటోంది. అయితే అసలు ట్విస్ట్ తెలుసుకుంటే ఏడాదికి కనీసం కోటి రూపాయలు సంపాదించే భర్త కోసం ఆమె వెతుకుతున్నట్లు స్క్రీన్ షాట్ లో చూడొచ్చు.

ఏప్రిల్ 2న షేర్ చేసిన ఈ పోస్ట్ కు ఇప్పటివరకు 5.5 లక్షల కంటే ఎక్కువ సార్లు వ్యూస్ వచ్చాయి. నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఒక డేటా ప్రకారం.. భారతదేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య కేవలం 1.7 లక్షలు మాత్రమే. అటువంటి పరిస్థితిలో ఈ మహిళ 37 సంవత్సరాల వయస్సులో తన ‘కలల యువరాజు’ని పొందడం కష్టమేనని కామెంట్లు చేశారు. మీరు అదే డిమాండ్ తో ఉంటే కచ్చితంగా ఒంటరిగా ఉంటారు’ అని మరికొందరు కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.