Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ernakulam-Patna Express: టికెట్‌ అడిగినందుకు ఘోరం.. టీటీఈని కదులుతున్న రైల్లో నుంచి బయటికి తోసేశాడు!

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ని కదులుతున్న రైలు నుంచి అమాంతం తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో ఈ ఘటన బుధవారం (ఏప్రిల్ 3) చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

Ernakulam-Patna Express: టికెట్‌ అడిగినందుకు ఘోరం.. టీటీఈని కదులుతున్న రైల్లో నుంచి బయటికి తోసేశాడు!
Ernakulam Patna Express
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2024 | 4:11 PM

వయనాడ్, ఏప్రిల్‌ 3: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ని కదులుతున్న రైలు నుంచి అమాంతం తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం (ఏప్రిల్ 3) వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో ఒడిశాకు చెందిన రజనీకాంత్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో స్లీపర్‌ కోచ్‌లో త్రిసూర్‌ స్టేఫన్‌లో ఎక్కాడు. టికెట్‌ లేకుండా అతను ప్రయాణిస్తున్నాడు. టీటీఈ వినోద్‌ తన విధుల్లో భాగంగా రైలులోని ఎస్‌ 11 బోగీలో ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా రజనీకాంత్‌ను కూడా టీటీఈ టెకెట్‌ చూపించమని అడిగారు. అతను టికెట్‌ చూపించకపోవడంతో ఇద్దరిమధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. టీటీఈ డోర్‌ వద్ నిలబడి డీబోర్డ్‌ చేయడం గురించి కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం ఇస్తున్నాడు. ఇంతలో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు రజనీకాంత్‌ టీటీఈని కేరళలోని ములన్‌కున్నతుకవు రైల్వే స్టేషన్‌కు సమీపంలో కదులుతున్న రైలులో నుంచి అమాంతం బయకు తోసేశాడు. దీంతో వినోద్‌ కుమార్‌ అవతలి పట్టాలపై పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఆయనను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు పాలక్కాడ్‌ వద్ద నిందితుడు రజనీకాంత్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై త్రిసూర్ రైల్వే పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు తెలిపారు. కేరళలోని ములన్‌కున్నతుకవు రైల్వే స్టేషన్‌కు సమీపంలో కదులుతున్న ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఆ వ్యక్తి టీటీఈని బయటకు నెట్టాడని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 302 కింద నిందితుడిని అరెస్ట్‌ చేసి, విచారణ చేపట్టినట్లు త్రిసూర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. మృతుడు వినోద్ స్వస్థలం ఎర్నాకులం జిల్లా మంజుమ్మెల్‌. అతనికి శారీరక గాయాల కారణంగా రెండేళ్ల క్రితం డీజిల్ లోకో యూనిట్ నుంచి బదిలీపై టీటీఈ విభాగంలో చేరాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.