Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.. ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, వీడియో!

దేశంలో ప్రతిరోజు కుక్కుకాటు సంఘటనలు పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో కుక్క కాటు ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫలితంగా అమయాక పిల్లల కుక్కల బారిన పడుతూ చనిపోతున్నారు కూడా. తాజాగా పంజాబ్ లో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.. ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, వీడియో!
Dogs Video
Follow us
Balu Jajala

|

Updated on: Apr 04, 2024 | 6:46 PM

దేశంలో ప్రతిరోజు కుక్కుకాటు సంఘటనలు పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో కుక్క కాటు ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫలితంగా అమయాక పిల్లల కుక్కల బారిన పడుతూ చనిపోతున్నారు కూడా. తాజాగా పంజాబ్ లో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఓ మహిళ ధైర్యంగా ప్రతిఘటించడంతో పెద్ద ముప్పు తప్పింది.

పంజాబ్లోని బటిండాలో ఓ బాలికపై వీధి కుక్కల గుంపు దాడి చేయగా, కాలనీలోని ఓ మహిళ కాపాడేందుకు ధైర్యంగా ముందుకొచ్చింది. బటిండా నేషనల్ కాలనీలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వీధిలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా వీధి కుక్కలు ఎంటర్ అయ్యాయి. తన వెనుక కుక్క ఉండటాన్ని గమనించిన బాలిక అక్కడ్నుంచి పారిపోగా, పక్కనే ఉన్న మరో బాలుడు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయినా కుక్కలు ఆ బాలుడిని వెంబండించి కరిచేందుకు ప్రయత్నం చేశాయి. అయితే మొదట్లో ఒక కుక్క మాత్రం దాడి చేయగా, ఆ తర్వాత నాలుగైదు కుక్కలు దాడి చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ ఘటనతో షాక్ కు గురైన హడావుడిగా ఓ ఇంటి వైపు పరిగెత్తాడు.

కానీ వీధిలో పడిపోయాడు, తరువాత వీధి కుక్కల గుంపు ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. కాని అదే కాలనీకి చెందిన ఓ మహిళ ధైర్యంగా ముందుకొచ్చి కుక్కల గుంపును చెదరగొట్టింది. ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. గతంలో ఘుమర్విన్ ప్రాంతంలో వీధికుక్క దాడిలో 20 మంది గాయపడ్డారు. ఆ కుక్క అకస్మాత్తుగా అటుగా వెళ్తున్న వారిపైకి దూసుకొచ్చి కరిచిందని మునిసిపల్ కౌన్సిల్ ఘుమర్విన్ ప్రెసిడెంట్ రీటా సెహగల్ తెలిపారు. అదే కాలనీలోని గాంధీ చౌక్ సమీపంలో కొన్ని గంటల వ్యవధిలో వీధికుక్క పలువురిని కరిచింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని, వారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చామని సెహగల్ తెలిపారు. అయితే ప్రస్తుతం బాలుడిపై దాడి చేసిన వీధికుక్కల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహిళ సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.