AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో ఇదేం క్యాబ్ సామీ.. 10 కిలోమీటర్ల ప్రయాణానికి కోట్లలో బిల్

బెంగళూరులో కేవలం 10 కిలోమీటర్ల ఉబర్ ఆటో ప్రయాణానికి హైదరాబాద్ కు చెందిన కస్టమర్ కు కోటి రూపాయలకు పైగా బిల్లు రావడంతో అతని తో పాటు డ్రైవర్ షాకయ్యారు. శ్రీరాజ్ నీలేష్ అనే కస్టమర్ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేసి అధిక ఛార్జీలపై అసహనం వ్యక్తం చేశాడు.

Watch Video: వామ్మో ఇదేం క్యాబ్ సామీ.. 10 కిలోమీటర్ల ప్రయాణానికి కోట్లలో బిల్
Auto Ride
Balu Jajala
|

Updated on: Apr 04, 2024 | 7:14 PM

Share

బెంగళూరులో కేవలం 10 కిలోమీటర్ల ఉబర్ ఆటో ప్రయాణానికి హైదరాబాద్ కు చెందిన కస్టమర్ కు కోటి రూపాయలకు పైగా బిల్లు రావడంతో అతని తో పాటు డ్రైవర్ షాకయ్యారు. శ్రీరాజ్ నీలేష్ అనే కస్టమర్ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేసి అధిక ఛార్జీలపై అసహనం వ్యక్తం చేశాడు. కేఆర్ పురంలోని టిన్ ఫ్యాక్టరీ నుంచి కోరమంగళకు కొద్దిదూరం వెళ్లేందుకు ఉబర్ యాప్ ద్వారా ఆటోను చేసుకున్నాడు. తొలుత రూ.207 మాత్రమే చూపించగా, గమ్యస్థానానికి చేరుకోగానే రూ.1,03,11,055 బిల్లు రావడంతో షాక్ కు గురయ్యామని నీలేష్ తెలిపారు. ‘ఇది సాంకేతిక లోపం? కస్టమర్ కేర్ కూడా స్పందించలేదు.

అందుకే ఈ వీడియోను సాక్ష్యంగా పెడుతున్నాను’ అంటూ మండిపడ్డాడు. అయితే గతంలో నోయిడాకు చెందిన దీపక్ తెంగూరియాకు రూ.62 రూపాయల సాధారణ ఆటో ప్రయాణానికి రూ.7.66 కోట్ల బిల్లు పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెంగురియా స్నేహితుడు ఆశిష్ మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన ఉబెర్ ఇండియా కస్టమర్ క్షమాపణలు చెప్పి, పరిస్థితిని చక్కదిద్దేందుకు దర్యాప్తు చేస్తున్నామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం పై ఘటన మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఉరుకుల పరుగుల మనిషి జీవితంలో టెక్నాలజీ ఓ భాగమైంది. టెక్నాలజీ సాయంతో మనిషి అనేక అవసరాలు తీర్చుకుంటున్నాడు. అయితే ఏదైనా గమ్యస్థానాలకు వెళ్లేక్రమంలో ఉబర్, ఓలా లాంటివి రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే వీటికి ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ, అక్కడక్కడ కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా తర్వాత వీటి సర్వీస్ లో వేగం తగ్గిందని పలువురు కస్టమర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.