Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court Magistrate: కోర్టు జడ్జి నీచ బుద్ధి.. అత్యాచార బాధితురాలిని బట్టలు విప్పమన్న న్యాయమూర్తి!

తప్పొప్పులను సమతూకం వేసి దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో కోర్టును ఆశ్రయిస్తారు. కానీ కోర్టు కూడా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే తమకు జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చేస్తారనే విధంగా రాజస్థాన్‌ కోర్టు ప్రవర్తించింది. ధర్మాన్ని రక్షించవల్సిన న్యాయమూర్తి ఓ అత్యాచార బాధితురాలిని ఆడగకూడని ప్రశ్న అడిగాడు. ఆమె శరీరంపై నేరానికి సంబంధించిన గుర్తులు, గాయాలు చూడాలని..

Court Magistrate: కోర్టు జడ్జి నీచ బుద్ధి.. అత్యాచార బాధితురాలిని బట్టలు విప్పమన్న న్యాయమూర్తి!
Judicial Magistrate
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2024 | 7:10 PM

జైపూర్‌, ఏప్రిల్ 4: తప్పొప్పులను సమతూకం వేసి దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో కోర్టును ఆశ్రయిస్తారు. కానీ కోర్టు కూడా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే తమకు జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చేస్తారనే విధంగా రాజస్థాన్‌ కోర్టు ప్రవర్తించింది. ధర్మాన్ని రక్షించవల్సిన న్యాయమూర్తి ఓ అత్యాచార బాధితురాలిని ఆడగకూడని ప్రశ్న అడిగాడు. ఆమె శరీరంపై నేరానికి సంబంధించిన గుర్తులు, గాయాలు చూడాలని కోర్టులోనే బట్టలు విప్పి చూపించమని సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని అడగటం వివాదంగా మారింది. దీంతో రాజస్థాన్‌లో మేజిస్ట్రేట్‌పై ఏప్రిల్‌ 2వ తేదీన కేసు నమోదు చేసినట్లు బుధవారం (ఏప్రిల్ 3) అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో 18 ఏళ్ల దళిత యువతిపై కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తారనే నమ్మకంతో కోర్టును ఆశ్రయించింది. తీవ్ర గాయాలతో కేవలం ప్రాణాలతో మాత్రమే బయటపడ్డ బాధితురాలి కేసును మార్చి 30 హిందౌన్ కోర్టు స్టేట్‌మెంట్‌ ముందుకు వచ్చింది. విచారణ సమయంలో గాయాలను చూడటానికి బట్టలు విప్పమని జడ్జి కోరాడు. దీంతో ఆమె బట్టలు విప్పడానికి నిరాకరించింది. కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బాధితురాలు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కోర్టు జడ్జిపై ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్నట్లు డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ST-SC) సెల్ మినా మీడియాకు తెలిపారు. బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతి, ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ 345 కింద మేజిస్ట్రేట్‌పై కేసు నమోదైనట్లు ఆమె తెలిపారు. ఈ కేసును రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వంలోని బృందానికి బదిలీ చేశారని, దీనిపై విచారణ జరుగుతోందని రాజస్థాన్ హైకోర్టు సీనియర్ అధికారి తెలిపారు. బుధవారం కరౌలీలో అత్యాచార బాధితురాలిని సందర్శించి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఎన్నిసార్లు ప్రయత్నించినా నిందిత మేజిస్ట్రేట్‌ను సంప్రదించలేకపోయామని ఆయన తెలిపారు.

కాగా మార్చి 19న దళిత యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. 20-22 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు వ్యక్తులు సాయంత్రం తల్లిదండ్రులు లేని సమయంలో యువతి ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, నిందితుల్లో ఒకరి ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాహారానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్), 376 డి (గ్యాంగ్‌రేప్) కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు, వారి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.