AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి’.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్

ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని, అందుకు అంగీకరిస్తేనే కిందికి దిగివస్తానని డిమాండ్ చేసింది. గమనించిన స్థానికులు ..

Viral Video: 'భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి'.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్
Woman Wants To Live Together With Husband And Lover
Srilakshmi C
|

Updated on: Apr 04, 2024 | 5:00 PM

Share

గోరఖ్‌పుర్‌, ఏప్రిల్‌ 4: ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని, అందుకు అంగీకరిస్తేనే కిందికి దిగివస్తానని డిమాండ్ చేసింది. గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు యత్నించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం (ఏప్రిల్‌ 3) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పిప్రాయిచ్‌ ప్రాంతానికి చెందిన సుమన్ దేవి (34) అనే మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అయితే గత ఏడేళ్లుగా ఆ మహిళ స్థానికంగా ఉంటోన్ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియుడు కూడా తమతోనే ఉంటాడని, అలా అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే ఈ ఒప్పందానికి భర్త అంగీకరించలేదు. దీంతో సుమన్ దేవి ఇప్పటికే రెండు సార్లు ఆత్మహత్యయత్నం చేసింది. నెల రోజుల క్రితం ఓ భవనం 5వ అంతస్తు నుంచి కింది దూకేందుకు యత్నించింది. అది విఫలయం కావడంతో రైలు పట్టాలపైకి వచ్చి మరోమారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇవి కూడా చదవండి

తాజాగా వారి గ్రామంలోని హై టెన్షన్‌ వైర్లు కట్టి ఉన్న విద్యుత్‌ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. వెంటనే గమనించిన స్థానికులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌ చేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఒప్పించి కిందికి దింపారు. సుమన్‌ దేవి భర్త తన సమస్యను పోలీసులకు వివరించాడు. ప్రేమికుడితో తన భార్య కలిసి ఉండాలనుకుంటుందని, ఆమె ముగ్గురు పిల్లల తల్లి అని, ఇలా చేస్తే సమాజంలో తన పరువు ఏం కావాలంటూ బోరుమన్నాడు. పోలీసులు సుమన్‌ దేవి, ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా గోరఖ్‌పూర్‌లోని ఐటీఐ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.