Viral: గోడ నిర్మాణం కోసం కూలీల తవ్వకాలు.. బయటపడింది చూసి షాక్..

పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారు నల్లాకు పక్కన గోడను నిర్మించేందుకు పూనుకున్నారు. అందుకోసం కొందరు కూలీలకు పని అప్పగించారు. వారు తవ్వకాలు జరుపుతుండగా అనూహ్య రీతిలో ఇది బడయపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు ఇలా...

Viral: గోడ నిర్మాణం కోసం కూలీల తవ్వకాలు.. బయటపడింది చూసి షాక్..
Rusted Artillery Shell
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2024 | 4:50 PM

బుధవారం పుణెలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. హింజావాడి సమీపంలోని మాన్ ప్రాంతంలో నల్లా వెంట సైడ్ వాల్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. తుప్పుపట్టిన ఫిరంగి షెల్ కనిపించింది. తదనంతరం, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS).. స్పాట్‌కు చేరుకుని.. దాన్ని పూర్తిగా బయటకు తీసి.. సేఫ్ ప్లేస్‌కు తరలించారు.

బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మాన్ మహాలుంగే రోడ్‌కు సమీపంలో నల్లా గోడ నిర్మాణం కోసం పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ జరిపిన తవ్వకంలో షెల్ బయటపడిందని హింజేవాడి పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు. గమనించిన వెంటనే, పని ప్రదేశంలోని కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. సమాచారాన్ని.. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు చేరవేశారు. వారు ఫిరంగి గుండును సురక్షిత ప్రదేశానికి తరలించారు.

హింజేవాడి పోలీస్ స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్ సోన్యాబాపు దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, “ప్రధానంగా, ఇది తుప్పు పట్టిన ఫిరంగి గుండు. ఇది బహుశా స్వాతంత్య్రానికి పూర్వం.. మిస్ ఫైర్ అయి ఉండవచ్చు. నిర్మాణ స్థలంలో ఉన్న కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మేము BDDSకి కాల్ చేసాము. వారు దానిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. రక్షణ అధికారులకు సమాచారం అందించాం. వారి బృందం దానిని పరిశీలించిన తర్వాత, మేము తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటాం” అని వివరించారు.

పూణె పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో తుప్పుపట్టిన పాత మందుగుండు సామాగ్రి బయటపడడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబరులో, శివాజీనగర్-హింజేవాడి మార్గంలో పూణే మెట్రో కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు హ్యాండ్ గ్రెనేడ్ కనుగొనబడింది. స్వాతంత్య్రానికి పూర్వం  పూణే చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నందున, ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నప్పుడు.. అప్పుడు  మిస్ ఫైర్ అయిన, పేలని మందుగుండు సామగ్రి కనుగొనే అవకాశం ఎల్లప్పుడూ ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?