Andhra Pradesh: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ.. క్షణికావేశంలో ఘోర తప్పిదం! ఏం జరిగిందంటే

దుస్తుల కోసం తోబుట్టువులు కొట్టుకోవడం ప్రతి ఇంట్లో ఉండేదే. అక్కా చెల్లెల్లు, అన్నాదమ్ములు ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం సగటు మధ్‌య తరగతి కుటుంబంలో ఉండేదే. తాజాగా ఓ ఇంట్లో టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ పెను విషాదం మిగిల్చింది. అన్న టీ షర్ట్ తమ్ముడు వేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో.. క్షణికావేశంలో.. ఇద్దరన్నాదమ్ముల్లో ఒకరు మృతి చెందారు..

Andhra Pradesh: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ.. క్షణికావేశంలో ఘోర తప్పిదం! ఏం జరిగిందంటే
Man Killed His Elder Brother For T Shirt
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 05, 2024 | 5:45 PM

సంతబొమ్మాళి, ఏప్రిల్ 5: దుస్తుల కోసం తోబుట్టువులు కొట్టుకోవడం ప్రతి ఇంట్లో ఉండేదే. అక్కా చెల్లెల్లు, అన్నాదమ్ములు ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం సగటు మధ్‌య తరగతి కుటుంబంలో ఉండేదే. తాజాగా ఓ ఇంట్లో టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ పెను విషాదం మిగిల్చింది. అన్న టీ షర్ట్ తమ్ముడు వేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో.. క్షణికావేశంలో.. ఇద్దరన్నాదమ్ముల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్ (31), సురేశ్ (25) అన్నదమ్ములు. పెద్దవాడైన రమేశ్ టీ షర్ట్‌ను తమ్ముడు సురేష్ గురువారం రాత్రి ధరించాడు. ఈ విషయం గమనించిన అన్న రమేష్‌ తమ్ముడిని మందలించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. రమేష్, సురేష్‌ మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సారి వ్యవహారం కాస్త ముదిరింది. దీంతో వారి గొడవ ఘర్షణకు దారి తీసింది. అన్న రమేష్‌ను తమ్ముడు సురేశ్ బలంగా నెట్టేశాడు.

దీంతో రమేశ్ తూలి అక్కడే ఉన్న రాయి మీద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం తగిలింది. రక్తస్తావం కావడంతో గమనించిన స్థానికులు వెంటనే బాధితుడు రామేష్‌ను సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతడు మృతి చెందాడు. చిన్న గొడవ వల్ల తమ కుటుంబంలో ఒకరు మృతి చెందడంతో ఆ రాత్రి వారి జీవితంలో కాళరాత్రిగా మిగిలిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్ధార్థ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.