Viral Video: మద్దురమ్మ దేవి జాతరలో అపశృతి.. కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం!
బెంగళూరులోని హుస్కుర్‌లో మద్దురమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతరలో 120 అడుగుల ఎత్తున్న భారీ రథం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఈ ఘటన శనివారం (ఏప్రిల్ 6) జరిగింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
బెంగళూరు, ఏప్రిల్ 7: బెంగళూరులోని హుస్కుర్‌లో మద్దురమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జాతరలో 120 అడుగుల ఎత్తున్న భారీ రథం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఈ ఘటన శనివారం (ఏప్రిల్ 6) జరిగింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బెంగళూరులో హుస్కుర్ మద్దురమ్మ ఆలయ జాతర చాలా ప్రఖ్యాతి చెందింది. అక్కడ అనేకల్ సమీపంలో శనివారం మత పరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహిస్తున్నారు. హుస్కూర్ మద్దూరమ్మ ఆలయ వార్షిక జాతరలో పదికి పైగా గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతీయేట అక్కడ ఎత్తైన రథాలను ఊరేగిస్తుంటారు. ఈ క్రమంలో దాదాపు 120 అడుగుల ఎత్తున్న భారీ రధాన్ని రూపిందించారు. రథ ఊరేగింపుకు వందలాది మంది భక్తులు సమాయత్త మయ్యారు. ఈ క్రమంలో రథాన్ని తాళ్లతో కట్టి పైకి నిట్టనిలువుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ బ్యాలెన్స్ కోల్పోయి రథం నేలకొరిగింది. పెద్ద శబ్ధంతో రథం పడిపోవడంతో భక్తులంతా భయందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల సాయంతో రథాన్ని యథాస్థానానికి చేర్చారు.
#WATCH | Karnataka: Devotees had a narrow escape after a temple chariot fell while it was being carried during the Madduramma Devi Jatre festival at Bengaluru’s Huskur. pic.twitter.com/RJ8LtB1w7Z
— ANI (@ANI) April 6, 2024
VIDEO | A 120-foot-tall temple chariot collapsed at Anekal town near Bengaluru earlier today, during the annual chariot fair of Huskur Madduramma Temple. pic.twitter.com/qbCda7JYVI
— Press Trust of India (@PTI_News) April 6, 2024
కాగా హుస్కూర్ మద్దురమ్మ జాతర బెంగళూరులో ప్రసిద్ధ వార్షిక రథోత్సవం. ఇక్కడి ఎత్తైన రథాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గత పదేళ్ల కాలంగా వందకు పైగా రథాలను ఈ జాతరలో ఊరేగిస్తూ వచ్చేవారు. అయితే ఇటీవల కాలంలో ఈ సంఖ్య కేవలం 10 నుంచి 15కి పడిపోయింది. రథాలను వీక్షించేందుకు హుస్కూర్ మద్దూరమ్మ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి జనాలు వస్తుంటారు. హుస్కూరులోని మద్దూరమ్మ దేవి ఆలయ ఉత్సవం హుస్కూర్ జాతరగా ప్రసిద్ధి. ఈ జాతరకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.