హేమంత్ సోరెన్ కేసులో కీలకంగా టీవీ, రిఫ్రిజిరేటర్.. ఈడీ దర్యాప్తులో కీలక విషయాలు..
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రూ. 31 కోట్లకు పైగా విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఈడీ తన వాదనకు మద్దతుగా రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్‌వాయిస్‌లు సాక్ష్యంగా చేర్చింది.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రూ. 31 కోట్లకు పైగా విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఈడీ తన వాదనకు మద్దతుగా రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్‌వాయిస్‌లు సాక్ష్యంగా చేర్చింది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను సేకరించింది. మార్చిలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌తో పాటు మరో నలుగురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రాంచీలోని ప్రత్యేక కోర్టు PMLAలోని న్యాయమూర్తి రాజీవ్ రంజన్ వద్ద హాజరుపరిచింది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 4న ప్రాసిక్యూషన్ ఫిర్యాదును స్వీకరించారు. జనవరి 31న ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే భూకబ్జాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడి అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను రాంచీలోని హోత్వార్‌లోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈడీ తన దర్యాప్తులో తెలిపిన దాని ప్రకారం, రెండు గాడ్జెట్‌లను ఒకే కుటుంబానికి చెందిన సంతోష్ ముండా పేరుతో కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్లను సేకరించింది. సంతోష్ గత 14 సంవత్సరాలుగా హేమంత్ సోరెన్‌కు సంబంధించిన 8.86 ఎకరాలు ఆస్తికి సంరక్షకునిగా ఉన్నారు. 15 సంవత్సరాల వరకు ఆ భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని సోరెన్ చేసిన వాదనపై ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో సంతోష్ ముండా మాటలను కీలకంగా పరిగణించింది. ఈ భూమిపై రాజ్‌కుమార్ పహాన్ అనే వ్యక్తి చేసిన దావాను కూడా ఈడీ తిరస్కరించింది. దీనికి కారణం అతను ఆస్తిని తన నియంత్రణలో ఉంచుకోవడానికి సోరెన్ మద్దతుగా ఇలా చేశాడని ఆరోపించింది. గత ఏడాది ఆగస్టులో ఈ కేసులో సోరెన్‌కు మొదటి సమన్లు జారీ చేసిన వెంటనే, పహాన్ రాంచీ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారని, తనతోపాటు మరికొందరికి భూమి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్‌ను రద్దు చేయాలని ఈడీ పేర్కొంది.
ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ప్రకారం, ఈ భూమి వాస్తవానికి ‘భూన్‌హరి’ ఆస్తి అని, సాధారణ పరిస్థితుల్లో ఎవరికీ బదిలీ చేయడం లేదా విక్రయించడం సాధ్యపడదని ‘ముండాస్’, ‘పహన్‌లు’ పేర్కొన్నారు. అయితే సోరెన్ వారిని తొలగించి 2010-11లో భూమిపై హక్కు సాధించుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే హేమంత్ సోరెన్, అతని భార్య కల్పన రెండు మూడు సార్లు భూమిని సందర్శించారని అలాగే ప్లాట్ వద్ద సరిహద్దు గోడను నిర్మిస్తున్నప్పుడు తాను కూలీగా పనిచేశానని సంతోష్ ముండా ఈడీకి తెలిపారు. అక్కడ విద్యుత్ మీటర్‌ను అమర్చిన కేసులో మరో నిందితుడు హిలారియాస్ కచాప్‌తో పాటు, ముండాకు ఆస్తి సంరక్షకునిగా హేమంత్ బాధ్యతను అప్పగించినట్లు ఈడీ పేర్కొంది.
అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ముండా కుమారుడి పేరిట 2017 ఫిబ్రవరిలో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయగా, రాంచీలో ఉన్న భూమి అడ్రస్‌పై నవంబర్ 2022లో అతని కుమార్తె పేరిట స్మార్ట్ టీవీని కొనుగోలు చేసినట్లు ఈడీ తెలిపింది. అందువల్ల, ఈ ఆస్తిలో సంతోష్ ముండా అతని కుటుంబం నివసిస్తున్నారని తేటతెల్లమైనట్లు పిటిషన్లో పేర్కొంది. రాజ్‌కుమార్ పహాన్ వద్ద లేని ఆస్తిని అతని వద్ద ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని, అవసరమైనప్పుడు అతని నుంచి సోరెన్ బదిలీ చేసుకునేందుకు ప్రణాళికలు రచించినట్లు ఈడీ తెలిపింది. ఇలా సోరెన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను తయారు చేసి అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా బయటకు రావాలనే ప్రయత్నంలో భాగంగా ఇలా వ్యూహరచన చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. అందుకే ఈ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్ కీలకం కానున్నట్లు తెలిపింది. ఈ వస్తువులు సంతోష్ ముండాది అయితే అతనికి ఈ భూమిని కేటాయించింది హేమంత్ సొరెన్ కనుక భూ కుంభకోణంలో అతను నిందితుడిగా చెప్పేందుకు ఈ ఇన్వాయిస్లే కీలకం అని భావిస్తోంది ఈడీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








