Liquor Shops: మందుబాబులకు బిగ్‌షాక్‌.. ఈ తేదీల్లో లిక్కర్‌ షాపులు బంద్‌..! కారణం ఇదే

రానున్న పండుగలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సర్కార్ శనివారం (ఏప్రిల్ 7) కీలక ప్రకటన వెలువరించింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో డ్రై డేలను ప్రకటించింది. దీంతో ఆయా తేదీలలో ఢిల్లీలో లిక్కర్‌ షాపులను మూసి వేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికలు రెండో విడతలో ఏప్రిల్ 26న ఢిల్లీలో పోలింగ్‌ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో..

Liquor Shops: మందుబాబులకు బిగ్‌షాక్‌.. ఈ తేదీల్లో లిక్కర్‌ షాపులు బంద్‌..! కారణం ఇదే
Dry Days In Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2024 | 6:59 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రానున్న పండుగలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సర్కార్ శనివారం (ఏప్రిల్ 7) కీలక ప్రకటన వెలువరించింది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో డ్రై డేలను ప్రకటించింది. దీంతో ఆయా తేదీలలో ఢిల్లీలో లిక్కర్‌ షాపులను మూసి వేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికలు రెండో విడతలో ఏప్రిల్ 26న ఢిల్లీలో పోలింగ్‌ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 24 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు డ్రై డే అమలులో ఉండనుంది. ఈ తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్, ఘజియాబాద్ మరియు గౌతమ్ బుద్ నగర్ జిల్లాల్లో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే రంజాన్‌ పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 11వ తేదీన కూడా ఢిల్లీలో లిక్కర్‌ షాపులు క్లోజ్‌ కానున్నాయి. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి, ఏప్రిల్‌ 21న మహవీర్‌ జయంతి నేపథ్యంలో కూడా వైన్‌షాపులు మూతపడనున్నాయి. ఇక మే నెల 23వ తేదీన బుద్ధపూర్ణిమ, జూన్‌ 17వ తేదీన బక్రీద్‌ నేపథ్యంలో లిక్కర్‌ షాపులను మూసివేయనున్నారు.

ఇవి కూడా చదవండి

పైన పేర్కొన తేదీల్లో ఏవరైనా లైసెన్సుదారులు పొరబాట్లకు పాల్పడితే వారి లైసెన్స్‌ రద్దు చేస్తామని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఈ తేదీలను తమ దుఖాణాల్లో ప్రదర్శించాలని పేర్కొంది. లైసెన్స్ పొందిన వారు మాత్రమే మిగతా రోజుల్లో అమ్మకాలు నిర్వహించవచ్చు. డ్రై డేలలో మాత్రం లిక్కర్‌ లైసెన్సుదారులు తమ షాపులను తప్పనిసరిగా మూసివేయాలని ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ట్వీట్‌లో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.