Elections 2024: ‘నా భార్య కాంగ్రెస్‌.. అప్పటి వరకు మా ఇంటికి వెళ్లను’ అలిగి గుడిసెకు చేరిన ఎంపీ అభ్యర్ధి

సాధారణంగా ఎన్నికల సందర్భంలో పలు విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రత్యర్ధులపై గెలవడానికి బరిలో ఉన్న అభ్యర్ధులు ఎత్తుకు పై ఎత్తు వేసి గెలిచేందుకు అస్త్రాలు సందిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎన్నికల పుణ్యమా అంటూ ఆ దంపతుల మధ్య కలకతలు ప్రారంభమయ్యాయి. భార్య వేరేపార్టీలో చేరిందని భర్త అలిగి ఇంటికి పోనని మొండికేశాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది..

Elections 2024: 'నా భార్య కాంగ్రెస్‌.. అప్పటి వరకు మా ఇంటికి వెళ్లను' అలిగి గుడిసెకు చేరిన ఎంపీ అభ్యర్ధి
Madhya Pradesh Poll Candidates
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2024 | 7:44 PM

భోపాల్‌, ఏప్రిల్ 7: సాధారణంగా ఎన్నికల సందర్భంలో పలు విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రత్యర్ధులపై గెలవడానికి బరిలో ఉన్న అభ్యర్ధులు ఎత్తుకు పై ఎత్తు వేసి గెలిచేందుకు అస్త్రాలు సందిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎన్నికల పుణ్యమా అంటూ ఆ దంపతుల మధ్య కలకతలు ప్రారంభమయ్యాయి. భార్య వేరేపార్టీలో చేరిందని భర్త అలిగి ఇంటికి పోనని మొండికేశాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలు సంగతేమంటే

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ నియోజకవర్గం నుంచి బీఎస్సీ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కంకర్ ముంజరే పోటీ చేస్తున్నాడు. అయితే ఆయన భార్య అనుభా ముంజరే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. గత ఏడాది ఎన్నికల్లో ఆమె బీజేపీపై అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా కంకర్ ముంజరే పోటీ చేస్తున్న బాలాఘాట్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి కోసం ఆయన భార్య ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో కంకర్ ముంజరే కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

‘నేను శుక్రవారం నా ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ప్రస్తుతం డ్యామ్ సమీపంలో ఒక గుడిసెలో ఉంటున్నాను. నా భార్య అనుభా ముంజరే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే కప్పుకింద ఉండకూడదు. ఒకవేళ అలా కలిసి ఉన్నట్లయితే ప్రజలు దానిని మ్యాచ్ ఫిక్సింగ్‌గా భావిస్తారు. అందుకే నేను ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఏప్రిల్‌ 19వ తేదీన పోలింగ్‌ తర్వాత మాత్రమే ఇంటికి తిరిగి వెళ్తానని శనివారం (ఏప్రిల్ 6) మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భార్య అనుభా ముంజరే బీజేపీ అభ్యర్థి ​గౌరీశంకర్ బిసెన్‌ను ఓడించారు. అయితే తన భర్త నిర్ణయంతో బాధపడ్డానని, పెళ్లి తర్వాత ఒక మహిళ చనిపోయే వరకు మెట్టినింటిలోనే ఉండాలని అనుభా ముంజరే అంటున్నాను. గతంలో ఆయన ఇక్కడి పరస్వాడ నుండి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్ టిక్కెట్‌పై బాలాఘాట్ నుంచి పోటీ చేశానని, ఆ సమయంలో తామిద్దరూ కలిసే ఉన్నామని తెలిపారు. తమకు వివాహం జరిగి 33 సంవత్సరాలు గడిచాయని, తమ కొడుకుతో ఎంతో సంతోషంగా ఉంటున్నామని అన్నారు. అంతేకాకుండా తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, బాలాఘాట్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్ విజయానికి కృషి చేస్తానని అనుభా ముంజరే పేర్కొన్నారు. అయితే ప్రచార సమయంలో తన భర్త గురించి చెడుగా మాట్లాడబోనని ఎమ్మెల్యే అనుభా ముంజరే అంటున్నారు. దీంతో రెండు వేర్వేరు పార్టీల కారణంగా ఈ దంపతులు ఇద్దరూ వార్తల్లో నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.