Viral: ఇంటి ముందు సైకిల్ తొక్కుతున్న బాలిక.. ఇంతలోనే ఘోర ప్రమాదం.. గూస్‌బంప్స్ పుట్టిస్తున్న వీడియో..!
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన వ్యక్తులు గూస్‌బంప్స్‌కు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ కనిపించింది. కానీ మరుసటి క్షణంలో, భయంకరమైన ప్రమాదం సంభవిస్తుంది. అది చూసిన ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురి చేయకమానదు.
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన వ్యక్తులు గూస్‌బంప్స్‌కు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ కనిపించింది. కానీ మరుసటి క్షణంలో, భయంకరమైన ప్రమాదం సంభవిస్తుంది. అది చూసిన ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురి చేయకమానదు. భారీ క్రేన్ కింద పడటం నునంచి బాలిక తృటిలో తప్పించుకుంది. అయితే, వీడియో చూసిన తర్వాత, అమ్మాయిని క్రేన్ కింద నలిగిపోయిందేమోననిపిస్తుంది..!
ఈ సంఘటన బ్రిటన్‌లోని లంకాషైర్‌లోని విగాన్‌లో జరిగింది. తన ఇంటి వెలుపల ఆడుకుంటున్న బాలికపై భారీ క్రేన్ పడిపోయింది. కానీ రెప్పపాటు బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మొత్తం రింగ్ డోర్‌బెల్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్థానిక మీడియా కథనం ప్రకారం, బాలిక ఇంటి ముందు సైకిల్ తొక్కుతోంది. మరోవైపు, ఇంటి సమీపంలో రోడ్డుపై పడి ఉన్న భారీ కంటైనర్‌ను క్రేన్ సహాయంతో పైకి లేపుతున్నారు. అదే సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక, దాన్ని గమనించిన అప్రమత్తమైంది. ఫుటేజీలో కనిపించిన విధంగా ప్రమాదాన్ని ముందగానే పసిగట్టిన అమ్మాయి, అకస్మాత్తుగా తన సైకిల్‌ను వదిలి ఇంటి వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. మరుసటి క్షణం క్రేన్ బోల్తా పడి ఇంటి ముందు వరకు దూసుకువచ్చింది. కంటైనర్ ఇంటి పైకప్పును పగులగొట్టుకుంటూ లోపలికి దూసుకువచ్చింది.
ఈ ఘోర ప్రమాదం వీడియోను ఇక్కడ చూడండి
A terrifying incident unfolded in Atherton, Wigan (UK), when a crane narrowly missed a child playing in a nearby garden before crashing through the roof of a house. pic.twitter.com/Iz00rLIbtT
— 🚨Fatal Error🚨 (@FatalEeror) April 7, 2024
అదృష్టవశాత్తూ, ఈ ఘోర ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే, క్రేన్ ఇంటి గోడను పగులగొట్టి గదిలోకి చేరుకుందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి గ్రేటర్ మాంచెస్టర్ ఫైర్ రెస్క్యూ సర్వీస్ (GMFRS) టీమ్ స్పందించింది. శనివారం ఏఫ్రిల్ ఉదయం సుమారు 10.30 గంటలకు అథర్టన్ నుండి ఒక క్రేన్ ఇంటిపైన పడిపోయిందని తమకు కాల్ వచ్చిందని స్థానిక అధికారులు చెప్పారు. UKలోని కొన్ని ప్రాంతాల్లో కాథ్లీన్ తుఫాను కారణంగా, వాతావరణ శాఖ బలమైన గాలులు వీస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ గాలుల కారణంగానే క్రేన్ ప్రమాదానికి గురై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంపై అధికారులు విచారణ కొనసాగుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…