పురుటి నొప్పలతో బాధపడుతున్న మహిళ.. సెల్ ఫోన్ వెలుతురులోనే డెలివరీ

పురుటి నొప్పలతో బాధపడుతున్న మహిళ.. సెల్ ఫోన్ వెలుతురులోనే డెలివరీ

Phani CH

|

Updated on: Apr 09, 2024 | 1:57 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్, క్యాండిల్స్ వెలుగులో ఓ గర్భిణికి ప్రసవం చేశారు. పురిటినొప్పులు ఎక్కువైన ఓ గర్భిణికి మారుమూల ప్రాంతంలో సెల్‌ఫోన్ వెలుతురులోనే 108 సిబ్బంది ప్రసవం చేశారు. పాల్వంచ మండలంలోని గొత్తికోయపల్లె సీతారామపురం పూర్తిగా మారుమూల పల్లె. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన ఆడవి. కనీసం రోడ్డు కూడా సరిగా లేని ప్రాంతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్, క్యాండిల్స్ వెలుగులో ఓ గర్భిణికి ప్రసవం చేశారు. పురిటినొప్పులు ఎక్కువైన ఓ గర్భిణికి మారుమూల ప్రాంతంలో సెల్‌ఫోన్ వెలుతురులోనే 108 సిబ్బంది ప్రసవం చేశారు. పాల్వంచ మండలంలోని గొత్తికోయపల్లె సీతారామపురం పూర్తిగా మారుమూల పల్లె. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన ఆడవి. కనీసం రోడ్డు కూడా సరిగా లేని ప్రాంతం. ఆర్ అండ్ బీ రోడ్డు వరకు చేరాలంటే ఐదారు కిలో మీటర్ల దూరం. అలాంటి ఈ గ్రామానికి చెందిన మడవి ఇడిమమ్మఅనే గర్భిణికి ప్రసవ సమయం కావడంతో ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు 108కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన లక్ష్మీదేవిపల్లిలోని 108 సిబ్బంది ఉపేందర్, ఈఎంటీ గుగులోత్ రాధ వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో ఊరి శివారులోని వాగు వద్ద సాంకేతిక కారణాలతో 108 వాహనం నిలిచిపోయింది. ఆ ఊళ్లో కనీసం కరెంట్ లేదు. దీంతో స్థానికుడి సాయంతో సెల్‌ఫోన్ టార్చిలైట్ల వెలుగులో కాలినడకన గర్భిణి ఇంటికి చేరుకున్నారు 108 సిబ్బంది. మరోవైపు ఇడిమమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమెను 108 వాహనం వరకు తరలించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే పురిటి బిడ్డ తల కొంచెం బయటకు రావడంతో ముందుకు తీసుకెళ్లడం ప్రమాదకరమని భావించిన 108 సిబ్బంది..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

పైకి గడ్డి వాము.. లోపల చూస్తే కళ్లు జిగేల్‌.. అదేంటో మీరే చూడండి..

మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 5000 మందికి పాస్‌పోర్టులు ఫ్రీ..

తిరుమల కొండపై కాళ్లకు కవర్లెందుకు కట్టుకుంటున్నారు

Ranbir Kapoor: ఒక్క సినిమాలో నటిస్తే రూ. 225 కోట్లా ??