Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya and Dhanush: ‘ఇక కలవడం కష్టమే’ 18 యేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతోన్న స్టార్ కపుల్‌..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్‌ దంపతులు అధికారికంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ జంట 2022 జనవరి 17లోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరి దారిలోవారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆ తర్వాత మళ్లీ ఈ విషయం మళ్లీ తెరపైకి రాకపోవడంతో ధనుశ్‌, ఐశ్వర్య మళ్లీ కలిసిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ జంట మళ్లీ కలుస్తారని కోటి..

Aishwarya and Dhanush: 'ఇక కలవడం కష్టమే' 18 యేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతోన్న స్టార్ కపుల్‌..
Aishwarya And Dhanush Divorce
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 08, 2024 | 4:31 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్‌ దంపతులు అధికారికంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ జంట 2022 జనవరి 17లోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరి దారిలోవారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆ తర్వాత మళ్లీ ఈ విషయం మళ్లీ తెరపైకి రాకపోవడంతో ధనుశ్‌, ఐశ్వర్య మళ్లీ కలిసిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ జంట మళ్లీ కలుస్తారని కోటి ఆశలతో ఎదురు చూశారు. కానీ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్‌ దంపతులు ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అందరికీ షాకిచ్చారు. పరస్పర అంగీకారంతో తామిద్దరూ విడిపోతున్నట్లు 2022లోనే విడిపోతున్నట్లు సెక్షన్‌ బి కింద కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన నాటి నుంచి గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. త్వరలోనే వీరి పిటిషన్‌ కోర్టులో విచారణకు రానుంది. ’18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నాం. ఈ రోజు మా మార్గాలు విడిపోయే ప్రదేశంలో ఉన్నాయి. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం..’ అంటూ ధనుష్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేశారు. దీనిపై అభిమానులు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా 2004లో ధనుశ్, ఐశ్వర్య 23, 21 యేళ్ల వయసులో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికీ యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తాజాగా వీరి విడాకుల ప్రకటన వెలువడటంతో ధనుశ్- ఐశ్వర్య టాపిక్‌ కోలీవుడ్‌లో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సినిమాల విషయానికొస్తే ఐశ్వర్య రజినీకాంత్ ‍’లాల్ సలామ్‌’ సినిమాను తెరకెక్కించారు. ఇక హీరో ధనుశ్‌ ‘రాయన్’ అనే మువీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌ వివాహాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. సూసర్ స్టార్ రజనీ కాంత్‌ నుంచి మెగస్టార్‌ చిరంజీవి వరకు వారి సంతానానికి చేసిన పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవడం లేదు. అనతికాలంలోనే విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటిస్తూ కన్నోళ్లకు తీరని వేదనను మిగులుస్తున్నారు. కెరీర్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించిన సీనియర్‌ హీరోలు తమ పిల్లల కారణంగా తీరని వేదన అనుభవిస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.