Nithya Menen: నిత్యామీనన్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనట..
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. కేవలం నటి మాత్రమే కాదు.. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా.. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నిత్యామీనన్.. ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.

నిత్యా మీనన్.. సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఈ రోజు ఈ చిన్నదాని పుట్టిన రోజు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది నిత్యామీనన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. కేవలం నటి మాత్రమే కాదు.. నిత్యామీనన్ మంచి సింగర్ కూడా.. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నిత్యామీనన్.. ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. అయితే ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎక్కడా కూడా నిత్యామీనన్ పెళ్లి ఊసే ఎత్తలేదు.
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. కొంతమంది సెలబ్రిటీలు కొన్ని ఇంటర్వ్యూలలో పెళ్లి వార్తల గురించి మాట్లాడారు. నిత్యా మీనన్ పెళ్లి చేసుకోకపోవడానికి పెద్ద కారణం ఉందట. ఈ విషయాన్ని ఆమె గతంలో తెలిపింది.
‘అన్నిటికీ మించి ఎదిగాను. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో మరొకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకున్నారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను స్వేచ్ఛ లేకుండా జీవించలేను. అది వాళ్లకు కూడా తెలుసు’ అని నిత్యా మీనన్ తెలిపింది. అలాగే పెళ్లి చేసుకోవాలని నిత్యా వాళ్ల అమ్మమ్మ ఒత్తిడి చేసేది. అయితే ఆమె మరణానంతరం ఎవరూ పట్టించుకోలేదు. అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి వచ్చేది. నేను పాపులర్ నటిని కావాలని మా అమ్మమ్మ కోరుకోలేదు. నేను ఏమీ చేయడం లేదని ఆమె భావించింది అందుకే పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేది. ఆమె ఇప్పుడు మనతో లేరు.ఆమె తప్ప మరెవరూ నా పెళ్లి విషయంలో పెద్దగా బాధపడలేదు’ అని గతంలో చెప్పుకొచ్చింది నిత్యా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.