Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: ఇది ఊహించని ఎంట్రీ గురూ..! మంచు విష్ణు కన్నప్పలో మరో స్టార్ హీరో..

ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. జిన్నా సినిమా తర్వాత మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతే కాదు ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీ నటులు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి వారు నటిస్తున్నారని తెలుస్తోంది.

Kannappa: ఇది ఊహించని ఎంట్రీ గురూ..! మంచు విష్ణు కన్నప్పలో మరో స్టార్ హీరో..
Kannappa
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2024 | 4:08 PM

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. జిన్నా సినిమా తర్వాత మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతే కాదు ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీ నటులు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి వారు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరోస్టార్ హీరో కూడా కన్నప్ప సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

పురాణ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా టీమ్‌లో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా చేరాడని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్‌లో హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ తెలుగులోకి ‘కన్నప్ప’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. అయితే కన్నప్ప సినిమాలో అక్షయ్ ఎలాంటి పాత్ర పోషిస్తాడో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది ఆయన అభిమానుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న విష్ణు మంచు ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ప్రభాస్, ప్రభుదేవా, మోహన్ లాల్, శరత్ కుమార్ తదితరుల తర్వాత అక్షయ్ కుమార్ గ్రాండ్ ఎంట్రీ’ అంటూ పోస్ట్ చేశాడు.

ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మధు, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, కుశాల్ తదితరులు నటిస్తున్నారు.  ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాగే నయన్ పార్వతి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక అక్షయ్ కుమార్ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే అక్షయ్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.. అందుకే సౌత్ ఇండియన్ సినిమాని ఓకే చేశారని టాక్ వినిపిస్తుంది. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియా చోటే మియా’ చిత్రం ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అక్షయ్.

అక్షయ్ కుమార్ ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.