Russia Floods: ప్రకృతి ఉగ్రరూపం.. వేగంగా కరుగుతోన్న మంచు! రష్యాను ముంచెత్తుతోన్న వరదలు

వర్షం జాడ లేకుండానే రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ కాలుష్యం కారణంగా మంచు వేగంగా కరుగుతోంది. రష్యాలోని ఉరల్ మంచు పర్వతాలు వేగంగా కరగడంతో యూరప్‌లోని అతిపెద్ద నదులకు నీరు పోటెత్తింది. రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరగడంతో వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. యూరప్‌లో మూడవ అతి పొడవైన నది అయిన ఉరల్‌ నది గత శుక్రవారం గంటల వ్యవధిలోనే ఉప్పొంగింది. నీటి ఉద్ధృతికి మాస్కోకు తూర్పున 1,800 కి.మీ దూరంలో ఉన్న ఓర్క్స్‌ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది..

Russia Floods: ప్రకృతి ఉగ్రరూపం.. వేగంగా కరుగుతోన్న మంచు! రష్యాను ముంచెత్తుతోన్న వరదలు
Russia Floods
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 08, 2024 | 5:11 PM

మాస్కో, ఏప్రిల్ 8: వర్షం జాడ లేకుండానే రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ కాలుష్యం కారణంగా మంచు వేగంగా కరుగుతోంది. రష్యాలోని ఉరల్ మంచు పర్వతాలు వేగంగా కరగడంతో యూరప్‌లోని అతిపెద్ద నదులకు నీరు పోటెత్తింది. రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరగడంతో వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. యూరప్‌లో మూడవ అతి పొడవైన నది అయిన ఉరల్‌ నది గత శుక్రవారం గంటల వ్యవధిలోనే ఉప్పొంగింది. నీటి ఉద్ధృతికి మాస్కోకు తూర్పున 1,800 కి.మీ దూరంలో ఉన్న ఓర్క్స్‌ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వరద నీరు ప్రజల ఇళ్లలోకి చొచ్చుకొచ్చాయి. రష్యా కజకిస్తాన్ సమీపంలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఉరల్ పర్వతాలలో పుట్టి కాస్పియన్ సముద్రంలోకి ప్రవహించే ఈ నది నీరు ఓర్స్క్ నగరంలో సోమవారం నాటికి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఏప్రిల్ 10 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే సుమారు 10,400లకు పైగా ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి. యురల్స్, సైబీరియా, వోల్గా, రష్యాలోని మధ్య ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించాయి.

అధిక ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా మంచు కరగడంతో ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 39 ప్రాంతాల్లో 10,400 కంటే ఎక్కువ ఇళ్లు వరద ముంపునకు గురైనట్లు వెల్లడించింది. అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవల ద్వారా ప్రజలను సుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద జోన్‌లో ఉన్న వారంతా ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మరో 2 రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని ఒరెన్‌బర్గ్ మేయర్ సెర్గీ సాల్మిన్ హెచ్చరించారు. ఒరెన్‌బర్గ్, కుర్గాన్, టియుమెన్ ప్రాంతాలలో వరదలను ఎదుర్కోవడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వాన్ని కోరినట్లు క్రెమ్లిన్ తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడు పుతిన్‌కు అప్‌డేట్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.