బ్రిటన్‌కు చెందిన ఈ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు.. రెండు ప్రపంచ యుద్ధాలు, కరోనా కూడా ఏమీ చేయలేకపోయింది.
వ్యాధులు, ఆహారపు అలవాట్లతో 60 సంవత్సరాల వయస్సు వచ్చేసరికే నిస్సహాయులుగా మారుతున్నారు. ప్రజలు 100 సంవత్సరాలు జీవించిన కాలం ఉంది. అయినా వ్యాధులు, జీవనశైలి కారణంగా మనిషి జీవించే సమయం ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి 100 ఏళ్లు దాటి జీవిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డు సృష్టించిన వ్యక్తి గురించి తెలుసుకుందాం..
మారిన కాలంతో పాటు మనవ జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో జీవించే సమయంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటాడు. అయినప్పటికీ వ్యాధులు, ఆహారపు అలవాట్లతో 60 సంవత్సరాల వయస్సు వచ్చేసరికే నిస్సహాయులుగా మారుతున్నారు. ప్రజలు 100 సంవత్సరాలు జీవించిన కాలం ఉంది. అయినా వ్యాధులు, జీవనశైలి కారణంగా మనిషి జీవించే సమయం ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి 100 ఏళ్లు దాటి జీవిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా రికార్డు సృష్టించిన వ్యక్తి గురించి తెలుసుకుందాం..
ప్రస్తుతం 111 ఏళ్ల వయసులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జాన్ టిన్నిస్‌వుడ్. ఉత్తర ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌లో 1912లో జన్మించిన టిన్నిస్‌వుడ్, రిటైర్డ్ అకౌంటెంట. మాజీ పోస్టల్ సర్వీస్ ఉద్యోగి. అతని వయస్సు 111 సంవత్సరాల 222 రోజులు. అతని సుదీర్ఘ జీవిత రహస్యం గురించి అడిగినప్పుడు, అతని సుదీర్ఘ జీవిత రహస్యం అదృష్టం మాత్రమేనని.. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేపలు, చిప్స్ తింటానని చెబుతాడు.
ఎంతకాలం జీవించాలనేది మన చేతుల్లో లేదు
జాన్ టిన్నిస్‌వుడ్ రిటైర్డ్ అకౌంటెంట్, మాజీ పోస్టల్ సర్వీస్ ఉద్యోగి. ఈ వయస్సులో కూడా జాన్ కు మాట్లాడటం చాలా ఇష్టమని అతనితో నివసించిన వ్యక్తులు చెప్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా అనేక విషయాలు చెబుతూ ‘మీరు ఎక్కువ కాలం జీవిస్తారా లేదా తక్కువ కాలం జీవిస్తారా అనేది మీ చేతుల్లో లేదు. కేవలం విధి చేతుల్లో మాత్రమే ఉంది. నా విషయంలో కూడా అదే జరిగింది. అంతేకాని ఎక్కువ కాలం జీవించడానికి తాను స్పెషల్ గా ఏమీ చేయలేదని చెప్పాడు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు
Meet John Tinniswood, the man who has just been confirmed as the oldest in the world! 👇
— Guinness World Records (@GWR) April 5, 2024
వెనిజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటె పెరెజ్ మోరా ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా పరిగణించబడటం గమనార్హం. ఇది కాకుండా, స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా పరిగణించబడుతుంది. ఆమె జనన ధృవీకరణ పత్రం ప్రకారం.. ఆ వృద్దురాలి వయస్సు 115 సంవత్సరాలు. మార్చి 4, 1907 న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..