AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనదేశంలో అత్యంత స్వచ్ఛమైన నీరున్న నది.. వేసవిలో పర్యటనకు బెస్ట్ ఎంపిక..

ఊటీ, మనాలి సహా అనేక ప్రదేశాలు సహజ సౌందర్యంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటాయి. అదే విధంగా దేశంలోని తూర్పు భాగం కూడా సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. నగరాల్లో నివసించే ప్రజలు తరచూ శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడికి చేరుకుంటారు. మీరు కూడా చుట్టూ పచ్చగా ఉండే అలాంటి ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మీరు ఖచ్చితంగా మేఘాలయను ఎంపిక చేసుకోండి. మేఘాలయ అనేక అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి.

మనదేశంలో అత్యంత స్వచ్ఛమైన నీరున్న నది.. వేసవిలో పర్యటనకు బెస్ట్ ఎంపిక..
Dawki River
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2024 | 10:36 AM

వేసవి కాలంలో ఎండలు మండిస్తున్నాయి. భానుడి భగభగలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఉష్ణోగ్రత పెరిపోతోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తూ ప్రణాళికలను వేస్తూ ఉంటారు. ఎంత వేడి ఉన్నా దేశంలో కొన్ని ప్రాంతాలు చల్లగా ఉండి హాయిని ఇస్తూ ఉంటాయి. ఊటీ, మనాలి సహా అనేక ప్రదేశాలు సహజ సౌందర్యంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటాయి. అదే విధంగా దేశంలోని తూర్పు భాగం కూడా సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. నగరాల్లో నివసించే ప్రజలు తరచూ శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడికి చేరుకుంటారు. మీరు కూడా చుట్టూ పచ్చగా ఉండే అలాంటి ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మీరు ఖచ్చితంగా మేఘాలయను ఎంపిక చేసుకోండి. మేఘాలయ అనేక అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి.

మేఘాలయలో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఒక నది మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఈ నదిలోని నీరు స్ఫటికం వలె స్పష్టంగా కనుపిస్తుంది. దీనిని ఉమ్‌గోట్ నది లేదా డోకి సరస్సు అని కూడా అంటారు. ఈ నది అందంగా, ప్రశాంతంగా ఉండటమే కాకుండా చాలా శుభ్రంగా ఉంటుంది. డాకీ మేఘాలయలో భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న పట్టణం. దీని పరిశుభ్రత, అందంతో ఈ గ్రామం 2003లో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా బిరుదు కూడా పొందింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

డోకి నది ఎక్కడ జన్మించిందంటే

ఈ నది బంగ్లాదేశ్‌లోని డోకి గుండా ప్రవహిస్తుంది. ఖాసీ – జైంతియన్ పర్వతాలను రెండు భాగాలుగా విభజిస్తుంది. మావ్లిన్‌యాంగ్ గ్రామం మీదుగా ఈ నది ప్రవహిస్తుంది. ఈ గ్రామం మేఘాలయ నుండి 78 కి.మీ దూరంలో ఉంది.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?

డాకీ చేరుకోవడానికి నగరం నుండి కేవలం 100 కి.మీ దూరంలో ఉన్న షిల్లాంగ్ ఉమ్రోయ్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అయినప్పటికీ చాలా మంది పర్యాటకులు అస్సాంలోని గౌహతికి రావడానికి ఇష్టపడతారు, ఆపై రోడ్డు ప్రయాణం ద్వారా ప్రయాణం చేస్తారు. ఈ విమానాశ్రయం గౌహతి నుండి 200 కి.మీ దూరంలో ఉంది. అయినప్పటికీ ఇతర నగరాలతో దీని కనెక్టివిటీ మెరుగ్గా ఉంది. ఇక్కడ నుండి మీరు డాకీకి బస్సు ,  టాక్సీ ద్వారా ప్రయాణించవచ్చు. బడ్జెట్ సమస్య లేకుంటే విమానం ప్రయాణం ఎంచుకోవచ్చు. ముందుగా గౌహతి ఎయిర్ పోర్ట్ కు చేరుకొని షిల్లాంగ్‌కు కూడా వెళ్లవచ్చు.

గౌహతి రైల్వే స్టేషన్ కేవలం 170 కి.మీ దూరంలో ఉన్న డోకికి సమీప రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ తర్వాత, మీరు బస్సు లేదా వ్యక్తిగత టాక్సీని కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ట్రిప్ మీకు దాదాపు 5 గంటల సమయం పడుతుంది.

అక్కడ సందర్శించాల్సిన ప్రదేశాలు

డాకీ బజార్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న జాఫ్లాంగ్ జీరో పాయింట్‌కి వెళ్లవచ్చు.

డోకి రివై రోడ్‌లో మీరు చెట్లతో కూడిన కొండలు, బుధిల్ జలపాతాలను ఆస్వాదించవచ్చు.

డోకికి వెళ్లిన వారు మావ్లిన్నాంగ్‌లో పర్యటించడం మర్చిపోవద్దు. ఈ గ్రామంలో కేవలం 80 ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఇళ్లను పర్యాటకులు హోమ్ స్టే, గెస్ట్ హౌస్‌లుగా ఎంపిక చేసుకుని ఆనందించవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..