AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Collector Anuradha Pal: పాలు అమ్మే వ్య‌క్తి కుమార్తె ఐఏఎస్.! అనురాధ పాల్ విజయగాథ.!

Collector Anuradha Pal: పాలు అమ్మే వ్య‌క్తి కుమార్తె ఐఏఎస్.! అనురాధ పాల్ విజయగాథ.!

Anil kumar poka
|

Updated on: Apr 08, 2024 | 8:52 AM

Share

కొందరు అనుకున్నది సాధించ‌డానికి ఎంతో క‌ష్టపడతారు. ఎన్ని కష్టాలొచ్చినా త‌మ ల‌క్ష్యాన్ని వదలరు. కృషి, అంకితభావం, పట్టుదలతో చివ‌రికి అద్భుతమైన విజయాల‌ను సాధించి లోకం విస్తుపోయేలా చేస్తుంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన విజయగాథనే ఐఏఎస్‌ అనురాధ పాల్‌ది . తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలలో ఆమె రెండుసార్లు విజయం సాధించారు.

కొందరు అనుకున్నది సాధించ‌డానికి ఎంతో క‌ష్టపడతారు. ఎన్ని కష్టాలొచ్చినా త‌మ ల‌క్ష్యాన్ని వదలరు. కృషి, అంకితభావం, పట్టుదలతో చివ‌రికి అద్భుతమైన విజయాల‌ను సాధించి లోకం విస్తుపోయేలా చేస్తుంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన విజయగాథనే ఐఏఎస్‌ అనురాధ పాల్‌ది . తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలలో ఆమె రెండుసార్లు విజయం సాధించారు. హరిద్వార్‌లోని ఒక చిన్న గ్రామంలో నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చిన అనురాధ తన చిన్నతనంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆమె హరిద్వార్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ త‌ర్వాత‌ పంత్ విశ్వ‌విద్యాల‌యంలో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి మారిన అనురాధ‌.. అక్క‌డ‌ టెక్ మహీంద్రాలో కొంత‌కాలం పని చేశారు. కానీ, ఆమెకు తాను చేస్తున్న ప‌నిలో సంతృప్తి క‌ల‌గ‌లేదు. తాను సాధించాల‌నుకుంది ఇది కాదు అనిపించింది.

అప్పుడే అనురాధ ఐఏఎస్‌ తన నిజమైన గోల్‌ అని గ్రహించారు. వెంట‌నే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె రూర్కీలోని ఒక కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా చేరారు. అక్క‌డ జాబ్ చేస్తూనే యూపీఎస్‌సీ కోసం ప్రిపేర్ అయ్యారు. అయినా, కోచింగ్ ఫీజుల‌కు డ‌బ్బులు స‌రిపోక‌ ఆమె విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పార‌ట‌. చివరగా, 2012లో తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్‌ 451తో పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ, ఆ ర్యాంక్‌తో ఆమెకు ఐఏఎస్ రాలేదు. క‌లెక్ట‌ర్‌ కావాలనేదే ఆమె క‌ల‌. దాంతో అనురాధ మళ్లీ సివిల్ స‌ర్వీసుల కోసం ప్రిప‌రేష‌న్ ప్రారంభించారు. దాంతో ఆమె 2015లో తన రెండవ ప్రయత్నంలో ఆల్ ఇండియా 62వ ర్యాంక్ కొట్టి ఐఏఎస్ సాధించారు. అనురాధ‌ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా ‌కలెక్టర్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..