Delhi: నెలన్నరగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్.! యువతిని చంపి అల్మారాలో కుక్కి.. వీడియో.
నెలన్నరగా సహజీవనం చేస్తున్న ఓ 26 ఏళ్ల యువతి తన ప్రియుడి చేతిలోనే హతమైంది. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ లోని దబ్రీ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయాలతో ఉన్న ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నెలన్నరగా సహజీవనం చేస్తున్న ఓ 26 ఏళ్ల యువతి తన ప్రియుడి చేతిలోనే హతమైంది. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ లోని దబ్రీ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయాలతో ఉన్న ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్ టైలర్‌తో ఉత్తరప్రదేశ్ మేరఠ్‌కు చెందిన ఓ యువతి గత నెలన్నరగా లివ్-ఇన్-రిలేషన్లో ఉంది. వీరిద్దరు కలిసి ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు యువతిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. బాయ్‌ఫ్రెండ్ తనను చంపేస్తాడేమోననే భయాన్ని కూడా మృతురాలు తండ్రితో వ్యక్తం చేసింది. దీంతో బాధితురాలి తండ్రి హుటాహుటిన తన కుమారుడితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే సంబంధిత దబ్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి ప్రేమికులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. ఇంట్లోని అల్మారాలో యువతి మృతదేహం లభించింది. ఈ క్రమంలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలను గుర్తించారు. దీంతో విపుల్ టైలరే తన ప్రేయసిని తీవ్రంగా కొట్టి చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

