AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eid Ul Fitr 2024: భారతదేశం, సౌదీ అరేబియాలో చంద్ర దర్శనం ఎప్పుడు? ఈద్ ను ఏ రోజున జరుపుకోవాలంటే

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పండుగ రంజాన్ నెల రోజుల ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఈ సమయంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ రానుంది. ఈ పవిత్ర పండుగ ఈద్-ఉల్-ఫితర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈద్-ఉల్-ఫితర్ ఖచ్చితమైన తేదీ ఏమిటి మరియు సౌదీ అరేబియా, UAE, భారతదేశం, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలలో ఈద్ చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు ఇప్పుడు తెలుసుకుందాం..

Eid Ul Fitr 2024: భారతదేశం, సౌదీ అరేబియాలో చంద్ర దర్శనం ఎప్పుడు? ఈద్ ను ఏ రోజున జరుపుకోవాలంటే
Ramadan 2024
Surya Kala
|

Updated on: Apr 08, 2024 | 8:35 AM

Share

ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం ముగియనుంది. ముస్లింల ముఖ్యమైన పండగ ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడానికి ముస్లిం సమాజం రెడీ అవుతున్నారు. దీనిని ఈద్ లేదా రంజాన్ ఈద్ అంటారు. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసం ముగింపు రోజుగా పరిగణించబడుతుంది. రంజాన్ మాసంలో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం (రోజా) ఉండి.. పవిత్ర ఖురాన్ చదివి, అల్లాను ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ సంవత్సరంలో తొమ్మిదవ నెల. పదవ నెల షవ్వాల్. ఈ నెల మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పండుగ రంజాన్ నెల రోజుల ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఈ సమయంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ రానుంది. ఈ పవిత్ర పండుగ ఈద్-ఉల్-ఫితర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈద్-ఉల్-ఫితర్ ఖచ్చితమైన తేదీ ఏమిటి మరియు సౌదీ అరేబియా, UAE, భారతదేశం, పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలలో ఈద్ చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు ఇప్పుడు తెలుసుకుందాం..

సౌదీ అరేబియా, అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లోని ప్రజలు మార్చి 11, 2024 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం ఒక నెల 29 లేదా 30 రోజులు. ఈ సంవత్సరం రంజాన్ 29 రోజుల పాటు కొనసాగితే ఏప్రిల్ 8 సోమవారం రోజులు ఈ దేశాల్లో ఈద్ చంద్రుడు కనిపించనున్నాడు. భారతదేశంలో ఉపవాసం 12 మార్చి 2024 నుండి ప్రారంభించారు. కనుక ఈద్-ఉల్-ఫితర్ చంద్రుడిని భారతదేశంలో ఏప్రిల్ 9వ తేదీన కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

సౌదీ అరేబియాలో ఈద్ ఎప్పుడు జరుపుకుంటారు

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఈజిప్ట్, టర్కీ, ఇరాన్, యునైటెడ్ కింగ్‌డమ్, మిడిల్ ఈస్ట్- వెస్ట్‌లోని ఇతర దేశాలలో ఏప్రిల్ 8 సాయంత్రం ఇఫ్తార్ తర్వాత చంద్రుడు కనిపిస్తే.. అప్పుడు ఈద్- ఉల్- ఫిత్ర్ పండుగ మరుసటి రోజు అంటే రేపు మంగళవారం (ఏప్రిల్ 09, 2024న) జరుపుకుంటారు, అయితే సోమవారం సాయంత్రం చంద్రుడు కనిపించకపోతే.. అప్పుడు ఆ దేశాల్లో ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం చంద్రుడు దర్శనం అవుతుంది. అప్పుడు ఈద్-ఉల్-ఫితర్ బుధవారం, ఏప్రిల్ 10, 2024న జరుపుకోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ ఎప్పుడు?

ఈద్-ఉల్-ఫితర్ అనేది ముస్లిం సమాజంలోని అన్ని కుటుంబాలు, స్నేహితులు తమ ఇళ్ల పైకప్పులపై లేదా ప్రాంగణాలు లేదా ఉద్యానవనాలు లేదా ఏదైనా బహిరంగ ప్రదేశంలో నెల వంకను చూడటానికి సమావేశమయ్యే వేడుకల సమయంలోకి వెళ్తే.. దక్షిణాసియా దేశాలతో పాటు భారతీయ ముస్లింలు మంగళవారం అంటే ఏప్రిల్ 09, 2024 సాయంత్రం చంద్రుడి దర్శనం చేసుకుంటే.. మర్నాడు అంటే ఏప్రిల్ 10, 2023 బుధవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇలా జరగకపోతే భారతదేశంతో సహా ఇతర దక్షిణాసియా దేశాలలోని ముస్లింలు మర్నాడు అంటే రేపు కూడా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అనంతరం ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఇఫ్తార్ తర్వాత చంద్రుడుని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈద్ గురువారం అంటే 11 ఏప్రిల్ 2023న జరుపుకోవాల్సి ఉంటుందని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!