Ugadi 2024: రేపు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగు .. ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్న పండితులు..

తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఈ 60 మంది నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని పురాణాల కథనం. 60 ఏళ్లు పూర్తి అయితే మళ్ళీ తిరిగి మొదటి ఏడాది మొదలవుతుంది. ఇలా సంవత్సరానికి ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. అంతేకాదు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. మొదటి రుతువు వసంత ఋతువు. మొదటి నెల చైత్ర మాసం.. మొదటి తిథి పాడ్యమి.. ఈ రోజునుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

Ugadi 2024: రేపు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగు .. ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్న పండితులు..
Ugadi Festival 2024
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2024 | 12:30 PM

తెలుగు నూతన సంవత్సరం ప్రారంభ రోజుగా భావించి ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథిన ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. 2024 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజుని ఉగాది పండగను జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రతి తెలుగు సంవత్సరానికి ఒకొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది తెలుగు సంవత్సరాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. క్రోధం అంటే అర్ధం కోపం.. కనుక ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరం కనుక ప్రజలు ఎక్కువ కోపం, ఆవేశం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు కలగడం, దేశంలో రాష్ట్రాల మధ్య విబేధాలు, భిన్నాభిప్రాయాలు, కోపం, ఆగ్రహం కలుగుతాయని, దేశాల యుద్ధ వాతావరణం నెలకొంటుందని, ఎక్కువగా యుద్ధాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో ఎన్నోది.. అసలు తెలుగు సంవత్సరాలు ఎన్ని? ఆ పేర్ల వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం..

తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే?

తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఈ 60 మంది నారదుడి పిల్లల పేర్ల మీదుగా తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని పురాణాల కథనం. 60 ఏళ్లు పూర్తి అయితే మళ్ళీ తిరిగి మొదటి ఏడాది మొదలవుతుంది. ఇలా సంవత్సరానికి ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. అంతేకాదు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. మొదటి రుతువు వసంత ఋతువు. మొదటి నెల చైత్ర మాసం.. మొదటి తిథి పాడ్యమి.. ఈ రోజునుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ ఏమిటంటే

బ్రహ్మ తనయుడు విష్ణు మానస పుత్రుడు నారదుడి బ్రహ్మచారి అన్న సంగతి తెలిసిందే.. అయితే పురాణాల్లో నారదుడి పిల్లలే తెలుగు నెలలుగా పేర్కొన్నాయి. దీనికి కారణం.. నారదుడి గర్వం తలకేక్కినట్లు భావించిన శ్రీ మహా విష్ణువు అతడి గర్వాన్ని అణచాలని భావించాడు. దీంతోనారదుడిని మాయ అనే స్త్రీగా చేశాడు. స్త్రీ రూపంలో ఉన్న మాయను ఒక రాజు మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 60 మంది పిల్లలు. వీరు ఒక యుద్ధంలో అకాల మరణం పొందుతారు. అప్పుడు విష్ణువు తన మాయను తొలగించి నారదుడిగా మార్చాడు. అంతేకాదు నీకు కలిగిన సంతానం 60 మంది గుర్తుగా సంవత్సరాలు ఏర్పడతాయని వరం ఇచ్చాడని పురాణాల కథనం.

ఇవి కూడా చదవండి

నారదుడి 60 మంది పిల్లలు తెలుగు సంవత్సరాల పేర్లు.. అర్ధం

  1.  ప్రభవ: ప్రభవ అంటే… ప్రభవించునది… అంటే… పుట్టుక. యజ్ఞ, యాగాలు అధికంగా చేస్తారు
  2.  విభవ: వైభవంగా ఉండేది సుఖంగా జీవిస్తారు
  3. శుక్ల : అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.సమృద్ధిగా పంటలు పండుతాయి
  4. ప్రమోద్యుత: ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత. అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది
  5. ప్రజోత్పత్తి: ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. ప్రతిదానిలోనూ అభివృద్ధి
  6. అంగీరస:అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం. భోగ భాగ్యాలు కలుగుతాయి
  7. శ్రీముఖ: శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం. వనరులు అధికంగా ఉంటాయి
  8. భావ : భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.ఉన్నత భావాలు కలిగి ఉంటారు
  9. యువ : యువ అనేది బలానికి ప్రతీక. వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి
  10. ధాత : అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. అనారోగ్య బాధలు తగ్గుతాయి
  11. ఈశ్వర : పరమేశ్వరుడు. క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది
  12. బహుధాన్య: సుభిక్షంగా ఉండటం. దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది
  13. ప్రమాది : ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి
  14.  విక్రమ : విక్రమం కలిగిన వాడు. పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు
  15. వృష : చర్మం. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
  16. చిత్రభాను : భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. అద్భుతమైన ఫలితాలు పొందుతారు
  17. స్వభాను : స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం. క్షేమము, ఆరోగ్యం
  18.  తారణ: తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి
  19. 19. పార్థివ: పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం. ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి
  20. వ్యయ : ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం. అతివృష్టి, అనవసర ఖర్చులు
  21. సర్వజిత్తు : సర్వాన్ని జయించినది. సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి
  22. సర్వదారి : సర్వాన్ని ధరించేది. సుభిక్షంగా ఉంటారు
  23. విరోధి: విరోధం కలిగినట్టువంటిది. వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం
  24. వికృతి: వికృతమైనటువంటిది. ఈ సమయం భయంకరంగా ఉంటుంది
  25. ఖర : గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి. పరిస్థితులు సాధారణంగా ఉంటాయి
  26. నందన : కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది. ప్రజలకు ఆనందం కలుగుతుంది
  27.  విజయ: విశేషమైన జయం కలిగినది. శత్రువులను జయిస్తారు
  28. జయ : జయాన్ని కలిగించేది. లాభాలు, విజయం సాధిస్తారు
  29. మన్మధ : మనస్సును మధించేది. జ్వరాది బాధలు తొలగిపోతాయి
  30. దుర్ముఖి :చెడ్డ ముఖం కలది. ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు
  31. హేవళంబి: సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. ప్రజలు సంతోషంగా ఉంటారు
  32. విళంబి : సాగదీయడం. సుభిక్షంగా ఉంటారు
  33. వికారి : వికారం కలిగినది. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది
  34.  శార్వరి: రాత్రి. పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది
  35. ఫ్లవ: తెప్ప. కప్ప, జువ్వి… దాటించునది అని అర్థం. నీరు సమృద్ధిగా ఉంటుంది
  36. శుభకృత: శుభాన్ని చేసి పెట్టేది. శుభాలు కలిగిస్తుంది
  37. శోభకృత్: శోభను కలిగించేది. లాభాలు ఇస్తుంది
  38.  క్రోధి: క్రోధాన్ని కలిగినది. కోపం కలిగిస్తుంది
  39. విశ్వావసు: విశ్వానికి సంబంధించినది. ధనం సమృద్ధిగా ఉంటుంది
  40. పరాభవ: అవమానం. ప్రజల పరాభవాలకు గురవుతారు
  41. ఫ్లవంగ: కోతి, కప్ప. నీరు సమృద్ధిగా ఉంటుంది
  42. కీలక : పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. పంటలు బాగా పండుతాయి
  43. సౌమ్య: మృదుత్వం. శుభ ఫలితాలు అధికం
  44. సాధారణ : సామాన్యం. సాధారణ పరిస్థితులు ఉంటాయి
  45. విరోధికృత్: విరోధాలను కలిగించేది. ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది
  46.  పరీధావి : భయకారకం. ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది
  47. ప్రమాదీచ: ప్రమాద కారకం. ప్రమాదాలు ఎక్కువ
  48. ఆనంద: ఆనందమయం. ఆనందంగా ఉంటారు
  49. రాక్షస: రాక్షసత్వాన్ని కలిగినది. కఠిన హృదయం కలిగి ఉంటారు
  50. నల : నల్ల అనే పదానికి రూపాంతరం. పంటలు బాగా పండుతాయి
  51. పింగళ: ఒక నాడి, కోతి, పాము, ముంగిస. సామాన్య ఫలితాలు కలుగుతాయి
  52. కాళయుక్తి : కాలానికి తగిన యుక్తి. కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి
  53. సిద్ధార్థి: కోర్కెలు సిద్ధించినది. కార్య సిద్ధి
  54. రౌద్రి : రౌద్రంగా ఉండేది. ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి
  55. దుర్మతి:దుష్ట బుద్ధి. వర్షాలు సామాన్యంగా ఉంటాయి
  56. దుందుభి : వరుణుడు. క్షేమం, ధ్యానం
  57. రుధిరోద్గారి: రక్తాన్ని స్రవింప చేసేది. ప్రమాదాలు ఎక్కువ
  58. రక్తాక్షి : ఎర్రని కన్నులు కలది. అశుభాలు కలుగుతాయి
  59. క్రోధన: కోప స్వభావం కలది. విజయాలు సిద్ధిస్తాయి
  60. అక్షయ: నశించనిది. తరగని సంపద

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా