Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bleeding Tree: భూమిపై ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయా.. చెట్టుని నరికితే రక్తం.. షాకింగ్ వీడియో వైరల్

శరీరంలో ఎక్కడైనా కోత పడినా, గాయపడినా రక్తం రావడం మానవులకు ఎలా జరుగుతుందో.. అదే విధంగా జంతువులకు కూడా జరుగుతుంది. అయితే చెట్టును నరికితే మనుషుల మాదిరిగా ఎర్రగా రక్తస్రావం అవుతుందని ఎప్పుడైనా ఊహించారా..! చెట్ల నుంచి రక్తం రావడం ప్రారంభిస్తే ఒక్కసారి ఊహించండి.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అలాంటి దృశ్యం కనిపిస్తుంది.

Bleeding Tree: భూమిపై ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయా.. చెట్టుని నరికితే రక్తం.. షాకింగ్ వీడియో వైరల్
Bleeding Tree
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2024 | 11:19 AM

మానవ శరీరంలో రక్తం ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికీ తెలుసు. రక్తం లేకుండా మానవుడు జీవించలేడు. మనుషులే కాదు వివిధ రకాల జంతువుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పక్షులు, జంతువుల  శరీరంలో రక్తం కూడా ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా కోత పడినా, గాయపడినా రక్తం రావడం మానవులకు ఎలా జరుగుతుందో.. అదే విధంగా జంతువులకు కూడా జరుగుతుంది. అయితే చెట్టును నరికితే మనుషుల మాదిరిగా ఎర్రగా రక్తస్రావం అవుతుందని ఎప్పుడైనా ఊహించారా..! చెట్ల నుంచి రక్తం రావడం ప్రారంభిస్తే ఒక్కసారి ఊహించండి.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అలాంటి దృశ్యం కనిపిస్తుంది.

నిజానికి చెట్టును నరికిన వెంటనే అది మానవుల్లా రక్తం స్రవించడం ప్రారంభిస్తుంది. ఒక వ్యక్తి చెట్టును పెద్ద కత్తితో నరికితే ఎర్రటి రక్తం రావడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. అదేవిధంగా అతను మరొక ప్రదేశంలో కత్తితో గాటు పెట్టగా అక్కడ నుంచి కూడా రక్తం రావడం కనిపిస్తుంది. ఇది ఏ చెట్టు అని ఇప్పుడు చూసి అని  ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టు లోపల మనుషుల మాదిరిగా రక్తం నిండి ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

నిజానికి ఇది ‘బ్లడ్ వుడ్ ట్రీ’. బ్లడ్‌వుడ్ చెట్లలో కనిపించే ఎర్రటి ద్రవం.. వాస్తవానికి ఇది రక్తంలా కనిపించే  ముదురు ఎరుపు రసం. దీనిని శాస్త్రీయంగా ‘కినో’ అని పిలుస్తారు. ఈ రసంలో టానిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది రక్తం లాంటి రంగును ఇస్తుంది.

ఈ షాకింగ్ వీడియో @gunsnrosesgirl3 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  కేవలం 17 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వీక్షించగా, 17 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒకరు ‘చెట్టును నరికి రక్తం వస్తున్నట్లు అరుస్తున్నాడు’ అని రాశాడు. మరొక వినియోగదారు ‘చెట్టు నుండి రక్తం వస్తోంది.. అంటే అది సజీవంగా ఉంది’ అని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్
ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు..ఎన్ని లాభాలో తెలిస్తే
ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు..ఎన్ని లాభాలో తెలిస్తే
ఈ చెట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్.. కాసులు కురిపించే వ్యాపారం
ఈ చెట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్.. కాసులు కురిపించే వ్యాపారం
దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్‌ మార్కెట్‌! మన హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్‌ మార్కెట్‌! మన హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
పెరిగిన భారతదేశ ఫారెక్స్ నిల్వలు.. ఐదు నెలల్లో అతిపెద్ద పెరుగుదల
పెరిగిన భారతదేశ ఫారెక్స్ నిల్వలు.. ఐదు నెలల్లో అతిపెద్ద పెరుగుదల
నిమ్మ తొక్కలతో ఎన్ని లాభాలో.. ఇవి తెలిస్తే ఇంకెప్పుడూ పారేయరు
నిమ్మ తొక్కలతో ఎన్ని లాభాలో.. ఇవి తెలిస్తే ఇంకెప్పుడూ పారేయరు
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. లైనప్‌పై క్లారిటీ..
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. లైనప్‌పై క్లారిటీ..
బెంగళూరులో దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
బెంగళూరులో దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
వాషింగ్టన్ అవుట్ పైవివాదం
వాషింగ్టన్ అవుట్ పైవివాదం