- Telugu News Photo Gallery Cinema photos Shah Rukh Khan Bought Mannat palace, What Price After Knowing This May You Get Shocked
Shah Rukh Khan: నేడు షారుఖ్ మన్నత్ ప్యాలెస్ రూ. 200 కోట్లు.. అసలు ఈ బిల్డింగ్ ఎంతకు కొన్నాడో తెలుసా..
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలున్నాయి. సామాన్యుడి నుంచి స్టార్ హీరోగా బాలీవుడ్ లో తనకంటూ ఓ పేజీలో లిఖించుకున్న షారుఖ్ ఖాన్ ..ముందుగా బుల్లి తెరపై సీరియల్ లో నటుడిగా అడుగు పెట్టాడు. తనని తాను నటుడిగా నిరూపించుకుంటూ విలన్ గా, సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా రకరకాల పాత్రల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగిన క్రమం ప్రతి ఒక్కరికీ స్పూర్తి దాయకం. కొన్ని సంవత్సరాల క్రితం రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించే రోజు నుంచి నేడు కోట్లాది రూపాయలకు అధినేతగా ఎదిగిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు సుమారు రెండు వందల కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నాడు.
Updated on: Apr 08, 2024 | 10:12 AM

200 కోట్ల విలువైన షారుఖ్ ఖాన్ బంగ్లా ఒకప్పుడు ఎవరికీ తెలియని విషయం తెలుసా? అది ఒక వ్యాపారవేత్త బంగ్లా. యస్ బాస్ సినిమా చిత్రీకరణ సమయంలో తొలిసారిగా ఈ బంగ్లా కెమెరా ముందుకు వచ్చింది. అది చూడగానే షారూఖ్ మనసు దోచేసింది. ఏదో ఒకరోజు ఈ బంగ్లా తాను ఖరీదు చేయాలనీ.. ఎలాగైనా బంగ్లా తనకే దక్కుతుందని అప్పుడే నిర్ణయించుకున్నాడు.

మన్నత్, షారూఖ్ ఖాన్ ప్యాలెస్. కింగ్ ఖాన్ నివసించే చోట. బాలీవుడ్ కింగ్ ఇల్లు. ఇప్పుడు ముంబై నగరంలో పర్యాటక ప్రదేశంగా మారింది.

200 కోట్ల బంగ్లా ఒక్కసారి చూస్తే చాలు చాలా ప్రశాంతత అనిపిస్తుంది. బయటి నుంచి చూస్తే బంగ్లా గురించి పెద్దగా అర్థం కాకపోయినా.. లోపల ఒక భారీ ప్యాలెస్. ప్రస్తుతం దీని చిత్రాలు సోషల్ మీడియాలో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ముంబైకి వెళ్లే వారు కనీసం ఒక్కసారైనా మన్నత్ భవనం ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తమ అభిమాన హీరో షారుక్‌ఖాన్ ను చూడాలని ఇంటి ముందు రోజూ వేల సంఖ్యలో అభిమానులు చేరుకుంటారు.

షారుఖ్ ఖాన్ ఎప్పుడు బయటకు వచ్చినా.. లోపలికి వచ్చినా తెలిసేలా అభిమానులు ఓ కన్నేసి ఉంచుతారు. షారుఖ్ ఖాన్ గడియారం పట్టుకుని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో వచ్చే సమయం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు 200 కోట్ల విలువైన షారుఖ్ ఖాన్ బంగ్లా గురించి ఇప్పుడు ఎవరికీ తెలియని విషయం గురించి తెలుసుకుందాం.. అది ఒక వ్యాపారవేత్త బంగ్లా. యస్ బాస్ చిత్రీకరణ సమయంలో తొలిసారిగా ఈ బంగ్లా కెమెరా ముందుకు వచ్చింది. ఆ బంగ్లాను చూసిన షారుఖ్ ఖాన్ ఎలాగైనా తాను ఆ భవనాన్ని కొనుగోలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ బంగ్లా కొనడానికి అవసరమైన డబ్బులను పోగుచేయడం ప్రారంభించాడు.

కేవలం కొన్ని సంవత్సరాలలో తాను మనసు పడిన భవనాన్ని కొనుగోలు చేశాడు. రూ 3.23 రూపాయలకు ఆ బంగ్లాను కొన్నాడు. దీనిని గతంలో మన్నత్ విల్లా అని పిలిచేవారు. ప్రస్తుతం ఈ భవనం విలువ 200 కోట్లు.

ఈ ప్యాలెస్ ను కొనుగోలు చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ భార్య గౌరీ క్రమంగా డెవలప్ చేయడం మొదలు పెట్టింది. రకరకాల వస్తువులను ఖరీదు చేసి అలంకరించడం మొదలు పెట్టింది,





























