- Telugu News Photo Gallery Cinema photos Films there are making huge collections like never before in the Malayalam industry
Kerala Story: మాటల్లేవు ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అంతే..! మలయాళ ఇండస్ట్రీ సత్తా..
ఏం తీస్తున్నార్రా.. మాటల్లేవు ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అంతే..! మలయాళ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఇండియన్ సినిమాలో జరుగుతున్న డిస్కషన్ ఇదే. ఎందుకంటే ఈ ఏడాది ఒకదాన్ని మించి మరో సినిమా వస్తుంది. తాజాగా మరో సినిమా అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసింది. అసలు కేరళ దండయాత్ర వెనక అసలు కథేంటి..? మలయాళ ఇండస్ట్రీలోనే ఎప్పుడూ లేనంతగా అక్కడి సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయిప్పుడు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 08, 2024 | 9:29 AM

ఏం తీస్తున్నార్రా.. మాటల్లేవు ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అంతే..! మలయాళ ఇండస్ట్రీ గురించి ఇప్పుడు ఇండియన్ సినిమాలో జరుగుతున్న డిస్కషన్ ఇదే. ఎందుకంటే ఈ ఏడాది ఒకదాన్ని మించి మరో సినిమా వస్తుంది. తాజాగా మరో సినిమా అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసింది. అసలు కేరళ దండయాత్ర వెనక అసలు కథేంటి..?

మలయాళ ఇండస్ట్రీలోనే ఎప్పుడూ లేనంతగా అక్కడి సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయిప్పుడు. 2024 మొదలై 4 నెలలు కూడా కాలేదు అప్పుడే అక్కడ్నుంచి రెండు 100 కోట్ల సినిమాలు.. ఒక 200 కోట్ల సినిమా వచ్చింది. తాజాగా ఆడు జీవితం అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ తెరకెక్కించిన ఆడుజీవితం సినిమా 8 రోజుల్లోనే కేరళలో 100 కోట్లు వసూలు చేసింది. దీనికంటే ముందు లూసీఫర్ పేరు మీద ఈ రికార్డ్ ఉంది. దాన్నిప్పుడు చెరిపేసారు పృథ్విరాజ్.

ఈ మధ్యే చిన్న సినిమాగా వచ్చి 230 కోట్లు వసూలు చేసింది మంజుమల్ బాయ్స్. ఇది కూడా సర్వైవల్ థ్రిల్లరే. తెలుగులోనూ దీనికి మంచి టాక్ వచ్చిందిప్పుడు. 20 కోట్లతో తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్ 250 కోట్ల వైపు అడుగులేస్తుంది.

ఇక ప్రేమలు కూడా 140 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ ఇది హిట్టైంది. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు.. టొవీనో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ 50 కోట్లు వసూలు చేసాయి. కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే.. తాబేలు కుందేలు కథలా టాలీవుడ్‌ను మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.





























