Tirumala: తిరుమల కొండపై సెగలు కక్కుతున్న సూర్యుడు.. అధిక ఉష్ణోగ్రతలతో భక్తుల ఉక్కిరిబిక్కిరి
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నిత్య కళ్యాణం.. పచ్చతోరణంలా విరాజిల్లుతుంటోంది. స్వామివారి దర్శనం కోసం దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే సమ్మర్ హాలీడేస్ ఉండటంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతోంది.

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నిత్య కళ్యాణం.. పచ్చతోరణంలా విరాజిల్లుతుంటోంది. స్వామివారి దర్శనం కోసం దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే సమ్మర్ హాలీడేస్ ఉండటంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే ఎండలు ముదురుతుండటంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో వేడి సిమెంటు రోడ్లపై నడిచే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు తమ పాదాలను కాపాడుకోవడానికి భక్తులు జూట్ బ్యాగులను పాదరక్షలుగా ధరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏప్రిల్ 2 సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, మండుతున్న ఎండల నుంచి భక్తులు తమ పాదాలను రక్షించుకోవడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అయితే దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లేటప్పుడే కాకుండా మాడ వీధుల్లో తిరిగేటప్పుడు కూడా భక్తులు చెప్పులు లేకుండా నడువాల్సి ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కల్పించిన వేసవి మండపాలు వంటి సౌకర్యాలను భక్తులు ఎందుకు ఉపయోగించుకోలేదని, కూలెంట్ పెయింట్ పూసిన రోడ్లు, కాలానుగుణంగా నీరు పోసి రోడ్లను చల్లబరిచారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల రెడ్ కార్పెట్లు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల వాటర్ స్ప్రింక్లర్లు కూడా ఉన్నాయి.
తిరుమల కొండ ఒకప్పుడు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. కానీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొండపై అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవిలో తిరుమలలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, కొన్నిసార్లు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటున్నాయి. దీంతో భక్తుల రక్షణ కోసం టీటీడీ మరిన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంది.