AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somvati Amavasya Puja: నేడు సోమవతి అమావాస్య.. స్త్రీలు రావి చెట్టుకు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి

సోమవతి అమావాస్య రోజున స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అమావాస్య రోజున సూర్యోదయంతో పవిత్ర నదులు, చెరువులు, లేదా గంగాజలంతో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గంగా స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి హర హర గంగా అంటూ పారాయణం చేస్తూ స్నానం చేయండి. ఇంట్లో లేదా గుడిలో ఆచార వ్యవహారాలతో పూజలు చేసి, తర్వాత రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి.

Somvati Amavasya Puja: నేడు సోమవతి అమావాస్య.. స్త్రీలు రావి చెట్టుకు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Somavati Amavasya
Surya Kala
|

Updated on: Apr 08, 2024 | 8:36 AM

Share

హిందూ మతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. హిందూ మతం ప్రకారం అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం దానధర్మాలు, పిండ ప్రదానం చేస్తారు. అంతే కాదు అమావాస్య రోజున మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజలు చేస్తారు. సోమవతి అమావాస్య రోజున స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. హిందూ మతంలో ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే మహిళలు రావి చెట్టు చుట్టూ ఎందుకు ప్రదక్షణ చేస్తారు? ఈ రోజు తెలుసుకుందాం..

అమావాస్య ముహూర్తం అమావాస్య సమయం:

పంచాంగం ప్రకారం పాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య తిథి ఏప్రిల్ 8 ఉదయం 3:21 గంటలకు ప్రారంభమై రాత్రి 11:50 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం సోమవతి అమావాస్య ఏప్రిల్ 8 న మాత్రమే జరుపుకుంటారు. దీని ప్రభావం రోజంతా ఉంటుంది.

సోమవతి అమావాస్య రోజున స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అమావాస్య రోజున సూర్యోదయంతో పవిత్ర నదులు, చెరువులు, లేదా గంగాజలంతో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గంగా స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి హర హర గంగా అంటూ పారాయణం చేస్తూ స్నానం చేయండి. ఇంట్లో లేదా గుడిలో ఆచార వ్యవహారాలతో పూజలు చేసి, తర్వాత రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. పరిక్రమ తరువాత పేదలకు, సాధువులకు మీ సామర్థ్యం మేరకు బట్టలు, ఆహారాన్ని దానం చేయండి.

ఇవి కూడా చదవండి

రావి చెట్టు ప్రదక్షిణ.. విశిష్టత

హిందూ మత విశ్వాసాల ప్రకారం వివాహిత స్త్రీలు సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఆచారాలతో రావి చెట్టును పూజించాలి. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. దీనితో పాటు వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇలా చేయడం వలన త్వరలో వివాహం జరుగుతుందని విశ్వాసం. అంతేకాదు జీవితంలో సమస్యల నుంచి  ఉపశమనం పొందుతారు. సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

సోమవారం అమావాస్య ప్రాముఖ్యత

హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమి తిధులు పూజకు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజున పూజించడం వల్ల దేవతలు సులభంగా సంతసించి భక్తులను అనుగ్రహయిస్తారు. అమావాస్య రోజున గంగా , ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా అనేక యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని ..  కుటుంబంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు