Trump: ఎన్నికల కోసం బైడెన్‌, ట్రంప్‌ ప్రచార బృందాలు పోరాపోటీ విరాళాలు.. ఒక్కరోజే 420 కోట్లు సమీకరించి ట్రంప్‌ పార్టీ రికార్డ్‌

అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు విరాళాల సేకరణలో పడ్డారు. ఎన్నికల విరాళాల సేకరణలో బైడన్‌, ట్రంప్‌ ఎన్నికల బృందాలు పోటీపడుతున్నాయి. అయితే రెండు రోజుల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే 50.5 మిలియన్‌ డాలర్లు అంటే.. దాదాపు 420 కోట్లు సమీకరించినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం బృందం ప్రకటించింది.

Trump: ఎన్నికల కోసం బైడెన్‌, ట్రంప్‌ ప్రచార బృందాలు పోరాపోటీ విరాళాలు.. ఒక్కరోజే 420 కోట్లు సమీకరించి ట్రంప్‌ పార్టీ రికార్డ్‌
Donald Trump
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2024 | 6:16 AM

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్‌, ట్రంప్‌ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్‌ గత నెలలో 750 కోట్లు సమీకరించగా.. ట్రంప్‌.. ఒక్కరోజు.. ఒక్క కార్యక్రమంలోనే 420 కోట్లు సేకరించడం సంచలనంగా మారింది. మార్చిలో 90 మిలియన్‌ డాలర్లు.. అంటే.. 750 కోట్లకు పైగా విరాళాలను సమీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఫలితంగా.. మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి 192 మిలియన్‌ డాలర్ల నిధులు తమ చేతిలో ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపువేనని తెలిపింది. మార్చి 28న రెడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్‌, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకూ వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

ఇక.. విరాళాల సేకరణలో డెమోక్రాటిక్‌ పార్టీతో రిపబ్లికన్‌ పార్టీ పోటీపడుతోంది. రెండు రోజుల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే 50.5 మిలియన్‌ డాలర్లు అంటే.. దాదాపు 420 కోట్లు సమీకరించినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం బృందం ప్రకటించింది. ఒక కార్యక్రమంలో ఇంతమొత్తం సమీకరించడం ఇదే రికార్డని పేర్కొంది. బైడెన్‌ బృందం రెడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ట్రంప్‌ టీమ్‌ సేకరించిన మొత్తం రెండింతలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి.. ట్రంప్‌.. ప్రచారం ప్రారంభించిన తొలినాళ్లలో విరాళాలిచ్చేందుకు దాతలెవరూ ముందుకు రాలేదు. పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ఇతరులకు మద్దతునిచ్చేందుకు మొగ్గుచూపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..