Cat: అయ్యో..! బావిలో పడ్డ పిల్లిని రక్షించేందుకు వెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు మృత్యువాత

ఆ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బావిలో పడిన పిల్లిని కాపాడడే వారి పాలిట శాపమైంది. ఒకరిని కాపాడటానికి మరొకరు వెళ్లి వరుసగా ఐదుగురు యువ రైతులు మృతి చెందారు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌లో మంగళవారం (ఏప్రిల్‌ 9) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణెకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలోని నెవాసా తాలూకాలోని..

Cat: అయ్యో..! బావిలో పడ్డ పిల్లిని రక్షించేందుకు వెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు మృత్యువాత
Abandoned Well
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2024 | 4:50 PM

అహ్మద్‌ నగర్‌, ఏప్రిల్‌ 10: ఆ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బావిలో పడిన పిల్లిని కాపాడడే వారి పాలిట శాపమైంది. ఒకరిని కాపాడటానికి మరొకరు వెళ్లి వరుసగా ఐదుగురు యువ రైతులు మృతి చెందారు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌లో మంగళవారం (ఏప్రిల్‌ 9) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణెకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలోని నెవాసా తాలూకాలోని వకాడి గ్రామంలోని పొలంలో పశువుల విసర్జనతో నిండిన  ఓ పాడుబడ్డ బావిని బయోగ్యాస్‌ కోసం వినియోగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ఆ బావిలో ఓ పిల్లి అనుకోకుండా పడిపోయింది. దాన్ని కాపాడేందుకు స్థానికులు పలు విధాలుగా ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి పిల్లిని కాపాడేందుకు నడుముకు తాడు కట్టుకొని బావిలోకి దూకాడు. అయితే అతడు బావిలో చిక్కుకుపోవడంతో అతడిని రక్షించేందుకు ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. వారిలో ఐదుగురు బావిలో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. అయితే ఓ వ్యక్తిని స్థానికులు ఎలాగోలా కాపాడగలిగారు. అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అహ్మద్‌నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ ఓలా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నెవాసా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ జాదవ్ తెలిపారు.
మృతి చెందిన ఐదుగురు వ్యక్తులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)లుగా గుర్తించారు. మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున బయటకు తీశారు. బావిలో పడిన పిల్లిని రక్షించేందుకు వెళ్లి

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి

ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!