AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత వ్యాధితో పుట్టిన బిడ్డ.. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లిని తిన్నా అందుకే ఇలా అంటున్న తల్లి..

పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు తల్లి నుంచే పోషకాహారాలు అందుతాయి. అందుకనే గర్భిణీ స్త్రీలు తినే ఆహారం విషయంలో మాత్రమే కాదు నిద్ర ఆలోచనలు అన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చాలా సార్లు పిల్లలు పుట్టుకతో వచ్చే వ్యాధుల బారిన పడతారు. అయితే ఈ విషయంలో తల్లి తప్పు ఉండాల్సిన పని లేదు. అయితే ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ వింత కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

వింత వ్యాధితో పుట్టిన బిడ్డ.. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లిని తిన్నా అందుకే ఇలా అంటున్న తల్లి..
World's Hairiest BabyImage Credit source: ViralPress
Surya Kala
|

Updated on: Apr 12, 2024 | 8:16 AM

Share

గర్భధారణ సమయంలో మహిళలు తమ శరీరంపై, ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ వహించాలని వైద్యులు ఎప్పుడూ చెబుతారు ఎందుకంటే ఈ సమయంలో తల్లి శరీరం కేవలం తల్లికి మాత్రమే కాదు బిడ్డకు కూడా చెందుతుంది కనుక. బిడ్డకు తల్లి శరీరం నుంచే పోషకాలు కూడా అందుతాయి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు తల్లి నుంచే పోషకాహారాలు అందుతాయి. అందుకనే గర్భిణీ స్త్రీలు తినే ఆహారం విషయంలో మాత్రమే కాదు నిద్ర ఆలోచనలు అన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చాలా సార్లు పిల్లలు పుట్టుకతో వచ్చే వ్యాధుల బారిన పడతారు. అయితే ఈ విషయంలో తల్లి తప్పు ఉండాల్సిన పని లేదు. అయితే ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ వింత కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

వైరల్ అవుతున్న ఈ కేసు ఫిలిప్పీన్స్‌కు చెందిన అపయావోకు సంబంధించినది. ఇక్కడ నివసించే అల్మా అనే మహిళ కుమారుడు జారెన్ గమోంగన్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది హైపర్‌ట్రికోసిస్ పేరుతో ప్రపంచానికి కూడా తెలుసు. ఇది శరీరంపై వెంట్రుకలు పెరిగే వ్యాధి. అయితే ఆ మహిళ తన బిడ్డను చూడగానే వింత వాదనలు వినిపించింది. వాస్తవానికి ఆ స్త్రీ తన బిడ్డకు ఇలా జరుగుతుందని తాను భావించినట్లు వెల్లడించింది. ఎందుకంటే తాను గర్భవతిగా ఉన్నప్పుడు.. పిల్లిని తిన్నానని.. ఆ పిల్లి ఇచ్చిన శాపానికి గురై తన బిడ్డ ఇలా అయ్యాడని చెబుతోంది.

ఆ చిన్నారికి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది?

డైలీ మెయిల్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఆ మహిళ పుట్టిన తర్వాత తన బిడ్డను చూసినప్పటి నుంచి మూఢ నమ్మకాలను విశ్వసిస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లిని తిన్నందుకే తన బిడ్డ శాపానికి గురైందని చెప్పడం మొదలుపెట్టింది. నిజానికి అల్మా నివసించే చోట పిల్లుల మాంసంతో ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు అడవి పిల్లులను తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదని.. వాటిని ఎక్కువగా తిన్నానని ఆ మహిళ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే అల్మా మాత్రమే కాదు ఆమె బిడ్డ విషయంలో గ్రామం మొత్తం ఇలాగే ఆలోచిస్తుంది. అయితే అల్మా  తన బిడ్డను డాక్టర్ వద్దకు తీసుకెళ్లినప్పుడు.. ఆ చిన్నారికి వచ్చిన వ్యాధి గురించి అల్మాకు చెప్పాడు. ఈ వ్యాధితో బాధపడేవారికి తలపైనే కాకుండా ముఖం, వీపు, చేతులు, ఛాతీ తదితర భాగాలపై కూడా వెంట్రుకలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి. అయితే, ఈ వ్యాధి కారణంగా, ఈ బిడ్డ ప్రపంచంలోనే అత్యంత వెంట్రుకగల బిడ్డగా పరిగణించబడుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..