AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెవడండీ బాబూ.. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన స్విగ్గీ బాయ్ ఏం చేశాడో తెలుసా, వీడియో చూస్తే షాక్!

బిజీ లైఫ్ వల్ల చాలామంది ఇంట్లో భోజనం తయారు చేసుకోలేక ఆన్ లైన్ ఫుడ్ ను డెలివరీ చేసుకుంటుంటారు. అయితే డెలివరీ బాయ్స్ ఎంతో నమ్మకంగా ఫుడ్ ను డెలవరీ చేస్తూ కస్టమర్స్ అభిమానాన్ని చూరగొంటుంటారు. అయితే కొంతమంది మాత్రం విచిత్రమై పనులు చేస్తూ తమ జాబ్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.

Viral Video: వీడెవడండీ బాబూ.. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన స్విగ్గీ బాయ్ ఏం చేశాడో తెలుసా, వీడియో చూస్తే షాక్!
Viral Video
Balu Jajala
|

Updated on: Apr 12, 2024 | 8:21 AM

Share

బిజీ లైఫ్ వల్ల చాలామంది ఇంట్లో భోజనం తయారు చేసుకోలేక ఆన్ లైన్ ఫుడ్ ను డెలివరీ చేసుకుంటుంటారు. అయితే డెలివరీ బాయ్స్ ఎంతో నమ్మకంగా ఫుడ్ ను డెలవరీ చేస్తూ కస్టమర్స్ అభిమానాన్ని చూరగొంటుంటారు. అయితే కొంతమంది మాత్రం విచిత్రమై పనులు చేస్తూ తమ జాబ్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తాజాగా స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ ఇంటి నుంచి నైక్ షూలను దొంగిలించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డయింది. అయితే కస్టమర్ స్విగ్గీ సంస్థను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ కంపెనీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోహిత్ అరోరా అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్విగ్గీ చొక్కా ధరించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్ కు ఆర్డర్ డెలివరీ కోసం ఓ ఇంటికి వెళ్తాడు. ఒక మహిళ ఆర్డర్ ను తీసుకొని ఆ తర్వాత తలుపును మూసివేస్తుంది.

డెలివరీ తర్వాత కూడా డెలివరీ బాయ్ కాసేపు అక్కడే ఉండిపోతాడు. చెమటను తుడుచుకోవడానికి తలకు చుట్టుకున్న టవల్ తీసి తుడుచుకుంటాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ లో కొంత సమయం గడుపుతూ అక్కడే ఉంటాడు. కొద్ది నిమిషాల తర్వాత డెలివరీ చేసిన వ్యక్తి ఇంటి ముందు చెప్పులు, షూ ఉండటం గమనిస్తాడు. ఎవరు లేని సమయంలో షూస్ తీసుకొని తన వెంట తెచ్చుకున్న టవల్ లో చుట్టుకొని పరార్ అవుతాడు.

ఈ ఘటన మొత్తం ఇంట్లోని సీసీటీవీలో రికార్డయింది. అయితే బూట్లు దొంగిలించిన వ్యక్తి పై కస్టమర్ స్విగ్గీ సంస్థకు ఫిర్యాదు చేస్తే కంపెనీ ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ సంఘటన చాలా మందిని గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది.  ఈ ఘటనతో డెలివరి బాయ్ చేసిన దొంగతనం వల్ల మిగతా బాయ్ ల మంచితనాన్ని ఎత్తిచూపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ