AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dugs Smuggling: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. వారి లగేజీ చెక్‌ చేయగా..

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కిలోల హెరాయిన్‌ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు ఎవరి కంట పడకుండా..

Dugs Smuggling: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. వారి లగేజీ చెక్‌ చేయగా..
Dugs Smuggling
Srilakshmi C
|

Updated on: Apr 10, 2024 | 5:21 PM

Share

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కిలోల హెరాయిన్‌ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు ఎవరి కంట పడకుండా హెరాయిన్‌ను లగేజ్‌ బ్యాగ్‌లో దాచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. స్కానింగ్‌ మిషన్‌లో లగేజ్‌ బ్యాగ్‌ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించి అధికారులకు దొరికిపోయారు. కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి స్మగర్లను పట్టుకున్నారు.

నిందితులు ఏప్రిల్ 3న బ్యాంకాక్ నుంచి వచ్చారని అధికారులు పేర్కొన్నారు. వారి లగేజీలో 5004 గ్రాముల (5.04 కిలోలు) బరువున్న గ్రీన్ కలర్ నార్కోటిక్ పదార్ధంతో కూడిన 13 ప్యాకెట్లను గుర్తించినట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.35 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడిన డ్రగ్స్‌ సీజ్‌ చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

‘ముస్లింల ఓట్లకన్నా వారి అభివృద్ధే ముఖ్యం’ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ

దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలకు నేతలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముస్లీం కమ్యునిటీ ఓట్లను రాబట్టడానికి వినూత్న ప్రచారం చేపట్టారు. మైనారిటీ ప్రాంతాల్లోని ముస్లింలలోని మియా వర్గం వారిలో సామాజిక పరివర్తన కోసమే తాను కృషి చేస్తున్నానని, అందుకే ఈ వర్గంలోని బహు భార్యత్వం, బాల్య వివాహాల వంటి సమస్యలను లేవనెత్తానన్నాడు. అంతేగానీ లోక్‌సభ ఎన్నికల్లో వారి ఓట్లు రాబట్టాలని కానేకాదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం వంటి ఆచారాల వల్ల మియాలు ఆర్థికంగా ఎలా పురోగాభివృద్ధి సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. బాలికలకు చదువు చెప్పించకుండా, ఆస్తిలో సమాన హక్కులు కల్పించకుంటే మియాలు అభివృద్ధి చెందలేరన్నారు. ముస్లీంలు మదర్సా విద్య నుంచి సాధారణ విద్యకు మారాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.