Summer Special Trains 2024: సికింద్రాబాద్‌ నుంచి వేసవి స్పెషల్‌ ట్రైన్స్‌.. ఏయే తేదీల్లో ఏయే రైళ్లు ఉన్నాయంటే..

విద్యార్ధులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ లోని షాలిమార్, సాంత్రగాచిలకు, కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు..

Summer Special Trains 2024: సికింద్రాబాద్‌ నుంచి వేసవి స్పెషల్‌ ట్రైన్స్‌.. ఏయే తేదీల్లో ఏయే రైళ్లు ఉన్నాయంటే..
Summer Special Trains
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 11, 2024 | 4:28 PM

సికింద్రాబాద్‌, ఏప్రిల్‌ 11: విద్యార్ధులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ లోని షాలిమార్, సాంత్రగాచిలకు, కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వివరించారు.

సికింద్రాబాద్ నుంచి ఏయే ప్రాంతాలకు ఏయే ట్రైన్లను నడుపుతారంటే..

  • సికింద్రాబాద్‌ – సాంత్రాగాచి (07223) స్పెషల్‌ రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు రైలు నడుస్తుదని అధికారులు తెలిపారు.అలాగే ప్రతి శనివారం తిరుగు ప్రయాణంలో సాంత్రాగాచి – సికింద్రాబాద్‌ (07224) రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు. ఈ ట్రైన్‌ తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌, విజయవాడ, దువ్వాడ, కటక్‌, ఖరగ్‌పూర్‌ మీదుగా ఈ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి.

  •  సికింద్రాబాద్‌ – షాలిమార్‌ (07225) స్పెషల్‌ రైలు ప్రతి సోమవారం ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24వ తేదీ వరకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో షాలిమార్‌-సికింద్రాబాద్‌ (07226) రైలు ప్రతి మంగళవారం ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు బయలుదేరుతాయి.
  • సికింద్రాబాద్‌ – కొల్లం (07193) మధ్య స్పెషల్ రైలు ఏప్రిల్‌ 17, 24, మే 1, 8,15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం – సికింద్రాబాద్‌ (07194) రైలు ఏప్రిల్‌ 19, 26, మే 3,10,17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఏపీలో గుంటూరు, ఒంగోలు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలు కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.