AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VH: అయ్యో.. హనుమంతన్న కాంగ్రెస్‌లో ఒంటరేనా.. ఈ సారి కూడా అందని ద్రాక్షేనా..?

రాజీవ్‌ గాంధీతో చనువు.. సోనియా గాంధీకి సలహాలిచ్చిన బడా లీడర్. ఆయన మాట చెబితే కొందరు పీసీసీ లీడర్లు కూడా అయ్యారు. గతమంతా ఘనం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఆ సీనియర్ ఒంటరయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనవైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటే ఆయన్ను పట్టించుకునే వాళ్లే లేరు.

VH: అయ్యో.. హనుమంతన్న కాంగ్రెస్‌లో ఒంటరేనా.. ఈ సారి కూడా అందని ద్రాక్షేనా..?
V Hanumantharao
Janardhan Veluru
|

Updated on: Apr 11, 2024 | 4:11 PM

Share

రాజీవ్‌ గాంధీతో చనువు.. సోనియా గాంధీకి సలహాలిచ్చిన బడా లీడర్. ఆయన మాట చెబితే కొందరు పీసీసీ లీడర్లు కూడా అయ్యారు. గతమంతా ఘనం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఆ సీనియర్ ఒంటరయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనవైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటే ఆయన్ను పట్టించుకునే వాళ్లే లేరు. ఆ సీనియర్ మోస్ట్‌ లీడర్ మరెవరో కాదు వీ హనుమంతరావు. ఆయన ఇప్పుడు ఒంటరయ్యారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన ఓ వెలుగు వెలిగారు. అయితే ఇప్పుడు సీటు కోసం ఏళ్ల తరబడి ఎదరుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ వెళ్లి మంతనాలు జరిపినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులతో మాట్లాడినా… ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. సికింద్రాబాద్‌ ఇవ్వలేదు… కనీసం ఖమ్మం సీటు ఇచ్చైనా న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ ఎంతో మందికి సాయం చేశానని వీహెచ్ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లెవరు తనను పట్టించుకోవట్లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత మంత్రి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క ఇవాళ ఇలా ఉన్నారంటే కారణం తనేనంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఖమ్మం సీటు విషయంలో ఆయన కూడా సహాయం చేయట్లేదన్నారు వీహెచ్‌. 2019లోనూ ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించానని వి హనుమంతరావు చెప్పుకొచ్చారు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ కూడా తనకు సీటివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి సైతం అన్ని విధాలా సాయం చేశానన్నారు వీహెచ్‌. అలాగే.. అధికారంలో ఉన్న నేతలందరూ ఖమ్మం సీటును తమ ఫ్యామిలీ మెంబర్స్‌కి అడగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను గుర్తించాలన్నారు.

మొత్తంగా… కట్టే కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానంటున్న వీహెచ్‌… ఖమ్మం పార్లమెంట్‌ సీటును తనకు ఎలాగైన ఇవ్వాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సహచర నేతల నుంచి మద్ధతు లేకపోవడంతో ఆయనకు ఈ సారి కూడా సీటు అందని ద్రాక్షగానే మిగిలిపోయే అవకాశముందన్న అభిప్రాయం సొంత పార్టీలోనే బలంగా వినిపిస్తోంది.