Adilabad: అంతా ఆ మంత్రిపైనే భారం.. క్యాడర్ ఒకటి తలిస్తే, లీడర్ మరొకటి తలిచినట్టుంది..!
ఆదిలాబాద్ లోక్‌సభ కవర్గం ఆదివాసుల ఖిల్లా. అన్ని పార్టీలు ఆ ఆదివాసీల ఓట్ బ్యాంకునే టార్గెట్ చేస్తూ, అభ్యర్థులను ఖరారు చేశాయి. సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని భారతీయ జనతా పార్టీ ఏకంగా సిట్టింగ్ ఎంపీ సోయం బాపు రావును కాదని బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్ ఖరారు చేసింది. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలోకి దింపింది.

ఆదిలాబాద్ లోక్‌సభ కవర్గం ఆదివాసుల ఖిల్లా. అన్ని పార్టీలు ఆ ఆదివాసీల ఓట్ బ్యాంకునే టార్గెట్ చేస్తూ, అభ్యర్థులను ఖరారు చేశాయి. సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని భారతీయ జనతా పార్టీ ఏకంగా సిట్టింగ్ ఎంపీ సోయం బాపు రావును కాదని బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్ ఖరారు చేసింది. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలోకి దింపింది. ఈ ఇద్దరు నేతలు గోండ్ సామాజిక వర్గ నేతలే కావడంతో వారిద్దరికీ ధీటుగా నిలిచేందుకు కాంగ్రెస్ అదిష్టానం వ్యూహం అమలు చేసింది.
లోక్‌సభ ఎన్నికల బరిలో సీనియర్లను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన కొత్త నేతను బరిలోకి దింపాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. అనుకున్నట్టుగానే ఆత్రం సుగుణను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆదివాసి ఉద్యమ నాయకురాలుగా.. ప్రభుత్వం ఉపాధ్యాయురాలుగా మంచి పేరున్న మహిళా నేత ఆత్రం సుగుణను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేయడంతో ఈ పార్లమెంట్ పరిదిలోని మహిళా ఓట్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకోవచ్చని బావించింది అదిష్టానం. మహిళా నేతకు.. అందులోను గోండుసామాజిక వర్గ నేతకే అదిష్టానం పట్టంకట్టడంతో మొదట్లో కాంగ్రెస్ క్యాడర్ సంబరాలు చేసుకుంది.
మహిళా అభ్యర్థి ఖరారుతో పార్లమెంట్ పరిదిలో అత్యదికంగా ఉన్న అతివల ఓట్లతో సగం విజయం సాధించినట్టే అని భావించింది క్యాడర్. అదిష్టానం సైతం ఈ పార్లమెంట్ ఎలాగైనా కైవసం చేసుకోవాలని మంత్రి సీతక్కను పార్లమెంట్ ఇంఛార్జ్ గా రంగంలోకి దింపింది. సీతక్క ఎంట్రీతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న బంజారా సామాజిక వర్గ కీలక నేతలకు చుక్కెదురైంది. టికట్ దక్కని నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దాదాపు రాంరాం చెప్పేశారు కూడా. దీంతో క్యాడర్ ఒకటి తలిస్తే లీడర్ మరొకటి తలిచినట్టుగా మారిందంట ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో హస్తం పార్టీ పరిస్థితి.
మరో వైపు హస్తం పార్టీ అదిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో పక్క పార్టీల నుండి హస్తం పార్టీలోకి భారీగా వలసలు పెరగడం.. వలస వచ్చిన కీలక నేతలకు పాత క్యాడర్ కు మధ్య అదే స్థాయిలో గ్యాప్ సైతం పెరగడంతో.. అదిష్టానం ఒకటి తలిస్తే కింది స్థాయి క్యాడర్ మరొకటి తలిచిందా అన్నట్టుగా మారిందంట ఆదిలాబాద్‌లో అధికార పార్టీ పరిస్థితి. అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడం.. ప్రచారంలో కలిసొచ్చే నేతలు కరువవడం.. నేతలకు అభ్యర్థికి మద్య సత్సబందాలు మరింత బలపడకపోవడంతో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుందన్న టాక్ నడుస్తోంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు అప్పగించింది పార్టీ అధిష్టానంప. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్‌సభ నియోజకవర్గ ప్రచారానికి మంత్రి సీతక్క వస్తున్న సమయంలోను క్యాడర్ కు సరైన సమాచారం లేకపోవడం.. మంత్రి సీతక్క ఏ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారనే ముందస్తు సమాచారం కింది స్థాయి క్యాడర్ కు లేకపోవడంతో ముఖ్య కార్యకర్తల సమావేశాలు సైతం ఎక్కడికక్కడ తేలిపోతున్నాయంట. అన్నీ తానై చూసుకోవాల్సిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం క్యాడర్ ను సమన్వయం చేసుకోవడంలో విఫలమవడంతో భారమంతా ఇంచార్జ్ మంత్రి సీతక్కపైనే పడుతుందంట. దీంతో చేసేదేమీ లేక క్యాడర్ ను లీడర్ ను సమన్వయం చేసేందుకు మంత్రి సీతక్క ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదంట.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లో ఒక్క ఖానాపూర్ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పార్టీలోకి వలసలు దండిగా పెరిగాయి. అటు సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప , ఇటు ముథోల్ మాజీ ఎమ్మెల్యేః విఠల్ రెడ్డి, ఇటు ఆదిలాబాద్ లో కీలక నాయకుల చేరికతో నియోజకవర్గ పరిధిలో హస్తం బలం బలగం దండిగా పెరిగింది. ఇంచార్జ్ మంత్రి సీతక్క వ్యూహరచనతో ఇదిసాధ్యమైంది. అయితే ఇలా వచ్చిన కొత్త నేతలకు పాత కాంగ్రెస్ తమ్ముళ్లకు మధ్య బందం మాత్రం ఆ స్థాయి లో బలపడటం లేదంట.
ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండటం.. హస్తం పార్టీ అభ్యర్థి ఎన్నికలకు కొత్త కావడం.. సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ పక్కా వ్యూహాలు అమలు చేస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో డీలాపడ్డ బీఆర్ఎస్ సైతం క్యాడర్ బలంతో ఈసారి గెలిచి నిలవాలని తీవ్రంగా చెమటోడుస్తోందట. ఈ త్రిముఖ పోరులో గెలిచి నిలవాలంటే అంతా ఏకతాటిపైకి వచ్చి సమిష్టి కృషి చేయక తప్పని పరిస్థితి హస్తం పార్టీది. క్యాడర్ దండిగా ఉన్నా లీడర్ల మధ్య సమన్వయ లోపంతో తేలిపోతున్న అధికార పార్టీ ఇప్పటికైనా గాడిన పడుతుందా లేదా అన్న అనుమానాలు తెర మీదకొస్తున్నాయట. వలస వచ్చిన కీలక నేతలకు పాత కాంగ్రెస్ కాపులకు బందం బలపడకపోతే అంతే సంగతులు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంచార్జ్ మంత్రి సీతక్కకి నియోజక వర్గ క్యాడర్, లీడర్లు పూర్తిస్థాయిలో మద్దతు అందించక పోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ పార్లమెంట్ పరిధిలో ఎంపీ ఎన్నికల్లోను రిఫీట్ అయ్యే ఛాన్స్ ఉందట. చూడాలి మరీ ఇంచార్జ్ మంత్రి సీతక్క మీదే భారం వేసి ఆదిలాబాద్ నేతలు చేతులు దులుపుకుంటారా.. లేక అంతా చేయి చేయి కలిపి విజయం వైపు సాగుతారా..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..